చిన్నారి దవడలో అరుదైన కేన్సర్‌ | - | Sakshi
Sakshi News home page

చిన్నారి దవడలో అరుదైన కేన్సర్‌

Mar 13 2026 7:46 AM | Updated on Mar 13 2026 7:46 AM

కరీంనగర్‌: చిన్నారి దవడలో ఏర్పడిన అరుదైన కేన్సర్‌ గడ్డను సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో విజయవంతంగా తొలగించినట్లు ఆసుపత్రి సీనియర్‌ అంకాలజిస్ట్‌ డాక్టర్‌ కె.శ్రీకాంత్‌ తెలిపారు. గురువారం కరీంనగర్‌ యశోద మెడికల్‌ సెంటర్‌లో మాట్లాడుతూ 8 ఏళ్ల బాలుడు కొన్ని రోజులుగా దవడవాపుతో బాధపడుతూ ఉండగా, కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించగా దవడలో సుమారు 4.5 సెం.మీ. పరిమాణంలో గడ్డ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎంఆర్‌ఐ స్కానింగ్‌ సహా ఇతర పరీక్షల్లో ఇది అరుదైన రకం కేన్సర్‌ శ్రీఇంట్రాఓస్సియస్‌ స్పిండిల్‌ సెల్‌ రాబ్డోమయోసార్కోమ్ఙాగా నిర్ధారణ అయిందన్నారు. ఈ నేపథ్యంలో వైద్య బందం ప్రత్యేక శస్త్రచికిత్స చేపట్టింది. శస్త్రచికిత్సలో భాగంగా దవడలోని కుడి భాగాన్ని తొలగిస్తూ ‘రైట్‌ హెమీ–మాండిబ్యులెక్టమీ’ నిర్వహించామన్నారు. అనంతరం చిన్నారి దవడ నిర్మాణం తిరిగి సక్రమంగా ఉండేందుకు కాలులోని ఫిబులా ఎముకను ఉపయోగించి ఫిబులర్‌ గ్రాఫ్ట్‌ పద్ధతితో కొత్త దవడను అమర్చామన్నారు. దీంతో శస్త్రచికిత్స విజయవంతమై బాలుడు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రి జనరల్‌ మేనేజర్‌ సత్యారెడ్డి, సీనియర్‌ మేనేజర్‌ సుధీర్‌ రెడ్డి, పొన్నాల రాజు పాల్గొన్నారు.

యశోదలో విజయవంతమైన శస్త్రచికిత్స

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement