ప్రత్యేక రైలు 12వరకు పొడిగింపు
రామగుండం: హైదరాబాద్–సిర్‌పూర్‌కాగజ్‌నగర్ మధ్య నడిచే ఫెస్టివల్ స్పెషల్ ట్రెయిన్‌ను మరోరెండు రోజులు పొడిగిస్తున్నట్లు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. తొలుత ఈనెల 9, 10వ తేదీల్లో ప్రత్యేక రైలు నడిపిస్తుండగా.. కోల్‌బెల్ట్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈనెల 11, 12వ తేదీల్లో కూడా ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు వివరించింది. హైదరాబాద్ – సిర్‌పూర్‌కాగజ్‌నగర్(07473) మధ్య 11, 12వ తేదీల్లో ఉదయం 7.55 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు చేరుకుంటుంది. సిర్‌పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్(07474) మధ్య ఈనెల 10, 11వ తేదీల్లో మధ్యాహ్నం 3.15గంటలకు బయలుదేరి రాత్రి 10.20 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.


