ముగిసిన సవరణ
నేడు ఓటర్ల తుది జాబితా ఇంటినంబర్ల వారీగా డివిజన్‌లకు ఓటర్ల మళ్లింపు రిజర్వేషన్‌లు మార్చేందుకు కొందరి ప్రయత్నం?
కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ కార్పొరేషన్ ఎ న్నికలకు సంబంధించిన డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను సోమవారం ప్రచురించనున్నారు. డివిజన్‌ల వారీగా ఓటర్ల జాబితా రూపొందించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌కు అనుగుణంగా అధికారులు ఓటర్ల జాబితాకు తుదిరూపు ఇచ్చారు. ఇదిలాఉంటే డివిజన్‌లలో రిజ ర్వేషన్‌లు మార్చేందుకు అవసరమైన ఓట్లను తారుమారు చేయడానికి ఒకరిద్దరు టౌన్‌ప్లానింగ్ అధికా రులు ప్రయత్నించినట్లు వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు సమాచారం.
సెలవు రోజుల్లోనూ కొనసాగిన ప్రక్రియ
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ల జాబితాను రూపొందించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. గత నెల 30 నుంచి మూడురోజుల పాటు కసరత్తు అనంతరం ఈ నె ల 1న నగరంలోని 66 డివిజన్‌ల వారీగా 3,40,775 ఓట్లతో ముసాయిదా జాబితా ప్రకటించారు. సద రు జాబితాపై 2 నుంచి 6వ తేదీ వరకు అభ్యంతరా లను నగరపాలకసంస్థ అధికారులు స్వీకరించారు. మొత్తం 249 అభ్యంతరాలు రాగా, డివిజన్‌ల వా రీగా సవరణకు క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అ భ్యంతరాల సవరణ ప్రక్రియ సెలవు రోజులైన శని, ఆదివారాలు కూడా కొనసాగించారు. ముందుగా ని ర్ణయించిన ప్రకారం ఈ నెల 10న ఓటర్ల తుది జాబి తా ప్రకటించాల్సి ఉండగా, ఎన్నికల సంఘం 12వ తేదీకి పొడగించింది. దీంతో నగరంలోని 66 డివి జన్‌లకు సంబంధించిన ఓటర్ల జాబితాతో పాటు, జిల్లాలోని చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాల్టీల్లో వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను సోమవారం వెల్ల్లడించనున్నారు.
అభ్యంతరాల సవరణ
ఓటర్ల ముసాయిదాపై వచ్చిన అభ్యంతరాలను అ ధికారులు ఆదివారం రాత్రి వరకు కొనసాగించారు. ముసాయిదా జాబితా తప్పుల తడకగా ఉందని, డి విజన్‌కు సంబంధం లేని ఓట్లు కలిశాయని, డివిజన్‌లో ఉండాల్సిన ఓట్లు ఇతర డివిజన్‌లోకి వెళ్లాయంటూ ఆశావహులు, నాయకులు, అన్ని పార్టీలు అధికారులకు ఫిర్యాదు చేశాయి. వచ్చిన అభ్యంతరాలను డివిజన్‌ల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్ల కూర్పు సమస్యగా మారడంతో, పోలింగ్ బూత్‌లను కూడా సరిచేసేందుకు చర్యలు చేపట్టారు. ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలను సరిచేయడంతో పాటు, ఏ డివిజన్ ఓటర్లు ఆ డివిజన్‌లోనే ఉండేలా ఇంటినంబర్ల వారీగా సవరించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంటినంబర్లు, కాలనీ పేర్లు లేకుండా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఓట్లు మాత్రం అవే డివిజన్‌లో ఉండే అవకాశం ఉంది.
ఓట్ల తారుమారుకు ప్రయత్నం..?
ఓట్ల సవరణను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించిన ఒకరిద్దరు పట్టణ ప్రణాళిక అధికారుల చేతివాటానికి చెక్ పడినట్లు తెలిసింది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని డివిజన్‌ల డీలిమిటేషన్‌లో పట్టణ ప్రణాళిక అధికారులు కొంతమంది, మాజీ కార్పొరేటర్లకు డివిజన్‌లను అనుకూలంగా మార్చినట్లు అప్పట్లో ఫిర్యాదులు వచ్చాయి. ప్రస్తుతం ఓటర్ల సవరణలోనూ ఒకరిద్దరు పట్టణ ప్రణాళిక అధికారులు అదే తరహాలో తమ చేతివాటాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. డివిజన్‌ల రిజర్వేషన్‌లు మార్చేందుకు ‘అవసరమైన’ ఓట్లను తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ డివిజన్‌లలో ఈ ప్రయత్నం జరుగుతున్నట్లు సంబంధిత డివిజన్‌ల నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వరుసగా ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు కూడా సంబంధిత టౌన్‌ప్లానింగ్ అధికారులపై సీరియస్ అయినట్లు, తప్పులు జరిగితే సస్పెండ్ చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం.


