త్యాగమూర్తి గురుతేజ్ బహదూర్
కరీంనగర్‌కల్చరల్: దేశ, ధర్మ రక్షణ, స్వేచ్ఛకు అక్షరరూపమైన త్యాగమూర్తి గురు తేజ్ బహదూర్ జీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కొనియాడారు. గురు తేజ్ బహదూర్ షహీదీ దివస్ సందర్భంగా ఆదివారం నగరంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. అలాగే అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అంబేడ్కర్ స్టేడియం నుంచి కలెక్టరేట్ రోడ్డు, ప్రతిమా మల్టీప్లెక్స్, బస్టాండ్ మీదుగా గురుద్వారాకు ర్యాలీ చేరుకుంది. సిక్కు యువకులు కత్తులతో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.


