పండుగ వేళ జాగ్రత్తలు తప్పనిసరి
కరీంనగర్‌క్రైం: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊళ్లకు వెళ్లే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. ఊర్లకు వెళ్లే ముందు సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవాలని, పెట్రోలింగ్ బృందాలు ఇంటిపై ప్రత్యేక నిఘా ఉంచుతాయని తెలిపారు. ఇంట్లో ఎక్కువ డబ్బు, బంగారం ఉంచకుండా బ్యాంకు లాకర్‌లో పెట్టుకోవాలని సూచించారు. ఇంట్లో లేమని సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్‌లు పెట్టొద్దన్నారు. ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే దొంగతనాలను నివారించవచ్చని వివరించారు. ఉదయం పేపర్లు, పూల మొక్కలు అమ్మేవారిగా, రాత్రి వేళ అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పోరాట యోధుడు ఓబన్న
కరీంనగర్‌టౌన్: రేనాటి స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతిని ఆదివారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఓబన్న చిత్రపటానికి కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచిన యోధుల్లో ఓబన్న ప్రముఖ వ్యక్తి అని పేర్కొన్నారు. బీసీ అభివృద్ధి శాఖ అధికారి ఎం.అనిల్‌ప్రకాష్, జిల్లా వడ్డెర సంఘం ప్రతినిధులు బి.సమ్మయ్య, సీహెచ్.రాజ్‌కుమార్, సీహెచ్.పద్మ, ఓ.రమేశ్, ఎస్.ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
స్టీమర్ సేవలకు ట్రయల్ రన్
గన్నేరువరం(మానకొండూర్): కరీంనగర్ నుంచి మైలారం శ్రీమల్లిఖార్జునస్వామి ఆలయం వరకు లోయర్ యానేరు డ్యాంలో స్టీమర్ (వాటర్ ట్రాన్స్‌ఫోర్ట్) సర్వీసును ప్రారంభించేందుకు ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించినట్లు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొమ్మెర రవీందర్‌రెడ్డి తెలిపారు. అలాగే ఖాసీంపేటలోని శ్రీమానసాదేవి, పారువెల్ల శ్రీలక్ష్మీగణపతి ఆలయాలకు రాకపోకలు పెరిగేందుకు దోహదపడుతోందని తెలిపారు. స్టీమర్ సేవలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవచూపడం హర్షణీయమన్నారు. మల్లిఖార్జునస్వామి ఆలయ చైర్మన్ వరాల పర్శరాములు, ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయిశర్మ తదితరులు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి
కరీంనగర్‌టౌన్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, న్యూఢిల్లీ వారి సహకారంతో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల ప్రత్యేక అధికారులు, హాస్టల్ వార్డెన్లకు కలెక్టరేట్‌లో నిర్వహించిన ఐదురోజుల శిక్షణ ఆదివారం ముగిసింది. శిక్షణ అంశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని విద్యార్థులను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని శిక్షణ నోడల్ అధికారి కృపారాణి అన్నారు. బాలికలను కేవలం విద్యావంతులుగానే కాకుండా, స్వయం ఉపాధి, ఆత్మవిశ్వాసంతో తమ కాళ్లపై తాము నిలబడేలా తీర్చిదిద్దాలని కోరారు. శిక్షణ అధికారి డా.దేబోర కృపారాణి, యాదాద్రి భువనగిరి జి ల్లా మాస్టర్ ట్రైనర్ నిర్మల జ్యోతి, డిస్ట్రిక్ట్ యూ త్ ఆఫీసర్ రాంబాబు, ట్రైనర్–రిసోర్స్ పర్సన్ సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పండుగ వేళ జాగ్రత్తలు తప్పనిసరి
పండుగ వేళ జాగ్రత్తలు తప్పనిసరి
పండుగ వేళ జాగ్రత్తలు తప్పనిసరి


