కాంగ్రెస్‌తోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

Jan 12 2026 7:40 AM | Updated on Jan 12 2026 7:40 AM

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

● ఇంట్లో చిచ్చు ఆర్పలేనివారు ప్రగల్భాలు పలుకుతున్నారు ● రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలు

గోదావరిఖని: ‘ఇంటిపోరును చక్కదిద్దుకోని మీరు ప్రజలకేం న్యాయం చేస్తార’ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నగరంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మైదానంలో ఆదివారం జరిగగిన బహిరంగ సభలో పొంగులేటి మాట్లాడారు. పేదల ఆత్మగౌరవం కాపాడేందుకు రూ.22,500 కోట్లతో రాష్ట్రంలో 4.5లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 67శాతం కాంగ్రెస్‌ మద్దతుదారులను గెలిపించిన ప్రజలు రాష్ట్రప్రభుత్వానికి మద్దతు పలికారని అన్నారు. ట్రాన్స్‌జెండర్లకు తొలిసారి రామగుండంలోనే ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. దివంగత సీఎం వైఎస్సార్‌ 76 జీవో జారీచేయగా.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఈ జీవో ప్రకారం సింగరేణి ప్రాంతంలో పేదల ఇళ్లకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో అదనంగా ఎమ్మార్వో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని, పాత్రికేయుల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మొండి గోడలుగా మిగిలిన 633 డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లనుపూర్తిచేస్తున్నామని, అసంపూర్తిగా మిగిలిన మరో 300 ఇళ్లకు నిధులు కేటాయిస్తామని తెలిపారు.

నిర్వాసితులను ఆదుకుంటాం

నగరంలో చేపట్టిన రోడ్డు విస్తరణలో ఆస్తి నష్టపోయిన వారిని ఆదుకుంటామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ శ్రమిస్తున్నారని ప్రసంశించారు. నియోజకవర్గంలో రూ.600 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు నాంది పలికామని తెలిపారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరవుతాయని అన్నారు.

ఆలయాల అభివృద్ధికి రూ.3కోట్లు

రామగుండంలోని ఆలయాల అభివృద్ధికి రూ.3 కోట్లు కేటాయించామని, మరో రూ.3కోట్లు ప్రతిపాదించామని, సీఎం ఎస్‌డీఎఫ్‌ నుంచి మంజూరు చేసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సు రేఖ అన్నారు. వైఎస్సార్‌ హయాం నుంచి సింగరేణి ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి ప్రారంభమైందని అన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ప్రజాప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని అభయం ఇచ్చారు.

గురుకులాలకు నిధులు

ఎస్సీ రెసిడెన్సియల్‌ పాఠశాలల కోసం ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తానని సంక్షేమ మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌కుమార్‌ హామీ ఇచ్చారు. సింగరేణి మెడికల్‌ బోర్డు నుంచి కార్మికులకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

నిర్లక్ష్యానికి గురైన రామగుండం

రామగుండం నగరం పదేళ్లపాటు గత పాలకుల ని ర్లక్ష్యానికి గురైందని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ విమర్శించారు. దివంగత సీఎం వైఎస్సార్‌ ఈ ప్రాంతంలోని 18 వేల పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారని, మరో 7వేల వరకు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. 50 మంది ట్రాన్స్‌జెండర్లకు ఇళ్లపట్టాలు అందించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నా రు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు వేణు, అరుణశ్రీ, డీసీపీ రాంరెడ్డి, ఆర్డీవో గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement