ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలే!
కరీంనగర్ అర్బన్: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్‌కు చెందిన ఇట్టవేని తనోజ్ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట దీక్షకు దిగాడు. తనోజ్ మాట్లాడుతూ పన్నెండేళ్ల క్రితం తల్లి మరణించిందని.. ఎవరూ లేరన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్‌ను కలిసి విన్నవించినా తనకు ఇల్లు మంజూరు కాలేదన్నారు.


