సీఎం సహాయ నిధితో పేదలకు లబ్ధి
● సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి
కరీంనగర్‌కార్పొరేషన్: సీఎం సహాయనిధితో పేదలకు లబ్ధి చేకూరుతుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని సుడా చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందిపడిన ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా చేయూతనందించామని తెలిపారు. అలాగే కార్యాలయంలో మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ప్రజల సమస్యల పరిష్కార వేదిక అయ్యిందన్నారు. వివిధ అవసరాల కోసం ప్రజలు హెల్ప్‌డెస్క్‌ను వినియోగించుకోవాలని కోరారు. గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, షబానా మహమ్మద్, సయ్యద్ ఖలీల్, మాసూమ్‌ఖాన్, ముల్కలా యోనా, జాఫర్, నదీమ్ తదితరులు పాల్గొన్నారు.


