సెలవులో కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

సెలవులో కలెక్టర్‌

Dec 30 2025 9:40 AM | Updated on Dec 30 2025 9:40 AM

సెలవు

సెలవులో కలెక్టర్‌

సెలవులో కలెక్టర్‌ స్పెషల్‌ గ్రేడ్‌ కమిషనర్‌గా స్వరూపారాణి రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇంటర్‌ లింకింగ్‌తో నిరంతర విద్యుత్‌

కరీంనగర్‌ అర్బన్‌: కలెక్టర్‌ పమేలా సత్పతి సెలవులో వెళ్లారు. వ్యక్తిగత కారణాల క్రమంలో జనవరి 4వరకు సెలవులో ఉంటారు. ఇన్‌చార్జి కలెక్టర్‌గా అదనపు కలెక్టర్‌ డా.అశ్విని తానాజీ వాకడే వ్యవహరించనున్నారు.

కరీంనగర్‌ కార్పొరేషన్‌: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పీడీ జి.స్వరూపారాణి స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఆమె మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–1 హోదాలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 మంది గ్రేడ్‌–1 మున్సిపల్‌ కమిషనర్‌లకు స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపల్‌ కమిషనర్‌లుగా పదోన్నతి కల్పిస్తూ మున్సిపల్‌ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో జిల్లా నుంచి ప్రస్తుతం మెప్మా పీడీ స్వరూపారాణితో పాటు, జమ్మికుంట మున్సిపల్‌ కమిషనర్‌ ఎండీ అయాజ్‌ కూడా ఉన్నారు.

గంగాధర(చొప్పదండి): మండలంలోని కురిక్యాల గ్రామ పంచాయతీ పాలకవర్గం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామంలో కొత్తగా నల్లా కనెక్షన్‌ కావల్సిన వారు ఒక్క రూపాయి చెల్లిస్తే సరిపోతుందని, ఆడపిల్ల పుడితే ఆమె పేరుమీద రూ.2,016 డిపాజిట్‌ చేయాలని నిర్ణయించారు. సోమవారం సర్పంచు కడారి రేణుక అధ్యక్షతన పాలకవర్గం సమావేశమై రెండు నిర్ణయాలపై తీర్మానం చేశారు. దీంతో గ్రామస్తులు పాలకవర్గాన్ని అభినందించారు.

కొత్తపల్లి(కరీంనగర్‌): వినియోగదారులకు నిరంతర విద్యుత్‌ సరఫరా అందించడమే లక్ష్యంగా విద్యుత్‌ శాఖ నూతన సాంకేతిక మార్పులు చేపడుతోందని టీజీఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అత్యవసర మరమ్మతులు (మెయింటెనెన్స్‌) చేపట్టినప్పుడు కరెంట్‌ సరఫరాకు ఆటంకం కలగకుండా ‘ఇంటర్‌ లింక్‌ లైన్‌’ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సబ్‌స్టేషన్‌ లేదా లైనులో సమస్య ఏర్పడితే ఇంటర్‌ లింకింగ్‌ ద్వారా 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి మరో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు, 33 కేవీ లైన్‌ నుంచి మరో 33 కేవీ లైన్‌కు అనుసంధానించి అంతరాయం లేకుండా విద్యుత్‌ స రఫరా చేయొచ్చని వివరించారు. కరీంనగర్‌ సర్కిల్‌ పరిధిలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ల (96), 33 కేవీ లైన్ల(94)లో ఇంటర్‌ లింకింగ్‌ వ్యవస్థను పూర్తి చేసినట్లు వివరించారు. మిగి లిన 2 సబ్‌స్టేషన్లు, లైన్ల పనులకు కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.

సైన్స్‌ సైనికులుగా మారాలి

కరీంనగర్‌టౌన్‌: జనవిజ్ఞాన వేదిక రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా కరీంనగర్‌ ఆర్డీవో మహేశ్వర్‌ మాట్లాడుతూ, విద్యార్థులు బాల్య దశ నుంచే ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకొని సైన్సు సైనికులుగా మారాలన్నారు. చెకుముకి రాష్ట్ర కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ పరీక్షలో ప్రైవేటు కంటే ప్రభుత్వ ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులకు పది మార్కులు ఎక్కువ రావడం విశేషం అని, విజ్ఞానానికి ఆర్థిక ఎల్లలు లేవని నిరూపించబడిందన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెలిమేల రాజేశ్వర్‌ మాట్లాడుతూ, పిల్లల్లో వైజ్ఞానిక భావాలను పెంపొందించడానికి చెకుముకి సైన్స్‌ సంబరాలు నిర్వహించడం జరిగిందన్నారు. సైన్స్‌ కమ్యూనికేటర్‌ వీఎస్‌ఎన్‌ మూర్తి, పారమిత పాఠశాల చైర్మన్‌ డాక్టర్‌ ఇ.ప్రసాదరావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర, జిల్లా బాధ్యులు ఆనంద్‌కుమార్‌, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, అల్ఫోర్స్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవగా, జెడ్పీ బాలికల పాఠశాల మంథనికి చెందిన విక్రాంత్‌, మణిచరణ్‌, శుశ్రుత రెండోస్థానం పొందారు. రాజన్న సిరిసిల్లకు చెందిన రంగినేని ట్రస్ట్‌ స్కూల్‌ రగుడు విద్యార్థులు శివమణి, భారత్‌, సిద్ధార్థ ప్రత్యేక కన్సోలేషన్‌ బహుమతి పొందారు.

సెలవులో కలెక్టర్‌
1
1/2

సెలవులో కలెక్టర్‌

సెలవులో కలెక్టర్‌
2
2/2

సెలవులో కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement