తండ్రి అంత్యక్రియలు చేసిన కూతురు
జమ్మికుంట(హుజూరాబాద్): పిల్లలు లేకపోవడంతో దత్తత తీసుకున్న కూతురు పెంచుకున్న మమకారాన్ని పంచింది. తండ్రికి అంత్యక్రియలు చేయడం కాలనీవాసులను కంటతడి పెట్టించింది. వివరాలు.. జమ్మికుంట మున్సిపల్ పరిధి 22వ వార్డు అంబేడ్కర్‌కాలనీకి చెందిన ఇల్లందుల భద్రయ్య, కృప దంపతులు. భద్రయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పెంచుకున్న కూతురు రమ అన్నీ తానై తండ్రి ఆలనాపాలన చూసింది. కొడుకు లేని లోటు తీర్చే బాధ్యతలు స్వీకరించింది. సోమవారం భద్రయ్య మృతిచెందడంతో అంత్యక్రియలు చేసింది. పెంచుకున్న మమకారంతో తండ్రి రుణం తీర్చుకుంది.


