బ్లాక్ స్పాట్ల వద్దే ప్రమాదాలు
నిబంధనలు అతిక్రమించడంతోనే..
● నామమాత్రంగా సూచిక బోర్డులు
● అతివేగంతో దూసుకెళ్తున్న వాహనాలు
గోదావరిఖని: గతేడాదితో పోల్చితే ఈఏడాది రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగాయి. ఆర్ అండ్ బీ, ఎకై ్సజ్, హైవే ఇంజినీరింగ్ శాఖల అధికారులతో కలిసి గ్రామ రోడ్డు భద్రత కమిటీ సభ్యులు తనిఖీలు చేశారు. మంచిర్యాల జోన్‌లోని వెంపల్లి – ముల్కల వంతెన, గుడిపేట వంతెన, పెద్దపల్లి జోన్‌లోని గోదావరిఖని బీ –గెస్ట్ హౌస్ పరిసరాల్లోనూ తనిఖీలు చేసి ప్రమాదా ప్రాంతాలు గుర్తించారు.
బ్లాక్ స్పాట్లను గుర్తించినా..
గతేడాది జరిగిన ప్రమాదాల్లో 131 మంది మృతి చెందగా, 221మందికి తీవ్ర, 301 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఈఏడాది 334 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 126 సంఘటనల్లో 137మంది మృతి చెందారు. 338 మందికి గాయాలయ్యాయి. రాజీవ్‌రహదారి వెంట బ్లాక్‌స్పాట్‌లను గుర్తించినా ప్రమాదాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోలేదు. దీంతోనే బ్లాక్‌స్పాట్‌ల వద్దే ప్రమాదాలు పెరిగాయి. ప్రధానంగా భారీవాహనాలు ఢీకొట్టడడంతో ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారు. ప్రమాదాల నియంత్రణకు రోడ్డు సేఫ్టీ విభాగాన్ని ట్రాఫిక్‌కు అప్పగించగా.. బ్లాక్‌స్పాట్‌ల వద్ద సూచికల బోర్డులు ఏర్పాటు చేశారు. పలు చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రమాదాలు కొంతతగ్గినా.. ఇప్పుడు సూచిక బోర్డులు లేక ప్రమాదాలు మళ్లీ పెరిగాయి.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మద్యం తాగి వాహనం నడుపుతూ తొలిసారి దొరికిన వారికి జరిమానా విధించి వదిలేశారు. రెండోసారి పట్టుబడ్డవారికి భారీ జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించారు. ఇలా గతేడాది 6,725 పట్టుపడగా, అందులో 3,352 మంది నుంచి రూ.44.14లక్షల జరిమానా వసూలు చేశారు. ఈఏడాది 9,678 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా.. రూ.96.45లక్షలు జరిమానా విధించారు.
రోడ్డు నిబంధనల అతిక్రమణ, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సేఫ్టీ డ్రైవ్ కోసం అవగాహన కల్పిస్తున్నాం.
– శ్రీనివాస్, ఏసీపీ, ట్రాఫిక్, రామగుండం
నాలుగేళ్లలో రోడ్డు ప్రమాదాలు, మృతులు, గాయపడినవారు
ఏడాది మృతులు తీవ్రగాయాలు గాయాలు
2022 128 44 296
2023 112 64 303
2024 131 221 301
2025 137 170 338
బ్లాక్ స్పాట్ల వద్దే ప్రమాదాలు


