ఫేస్ బయోమెట్రిక్ తప్పనిసరి
సప్తగిరికాలనీ(కరీంనగర్): రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాలకు మేరకు అన్ని డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఫేస్ బయోమెట్రిక్‌ను విద్యార్థులకు తప్పనిసరి చేయాలని శాతవాహన యూ నివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఉమేశ్‌కుమార్ ఆదేశించారు. వర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ, పీజీ ప్రభుత్వ, ప్రైవేటు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్, సెక్రటరీలు, కరస్పాండెంట్లు, ఇన్‌చార్జీలతో గురువారం సమావేశం అయ్యారు. విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని కళాశాలలో విద్యార్థులకు, అధ్యాపకులకు, బోధనేతర సిబ్బందికి ఫేస్ బయోమెట్రిక్ అమలు చేస్తున్నామన్నారు. రిజిస్ట్రార్ రవికుమార్, పరీక్షల నియంత్రణ అధికారి డి.సురేష్ కుమార్, ఓఎస్డీ బి.హరికాంత్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సస్పెన్షన్
కరీంనగర్‌టౌన్/హుజూరాబాద్: జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ డీఈవో శ్రీరాం మొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. హుజూరాబాద్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఏ.సమ్మయ్య, పీఈటీ ప్రవీణ్‌కుమార్ మద్యం సేవించి విధులకు హాజరుకావడంతో సస్పెండ్ చేశారు. హుజూరా బాద్ మండలం చెల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఎం.అయిలయ్య విధుల్లో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాడని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
కరీంనగర్ అర్బన్: రెవెన్యూశాఖలో పలువురు నాయబ్ తహసీల్దార్ల(ఎన్‌టీ)ను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సి.సందీప్(ఆర్డీవో,హుజూరాబాద్)ను శంకరపట్నం ఎన్‌టీగా నియమించారు. సర్దార్ మన్మిత్‌సింగ్ (ఇల్లందకుంట)ను హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయానికి, కె.పార్థసారథి(శంకరపట్నం)ని ఇల్లందకుంటకు బదిలీ చేశారు.
హుజూరాబాద్ తహసీల్దార్‌గా నరేందర్
హుజూరాబాద్ తహసీల్దార్‌గా గన్నేరువరం తహసీల్దార్ నరేందర్‌ను నియమించినట్లు సమాచారం. తహసీల్దార్ కోడం కనకయ్యను గన్నేరువరం బదిలీ చేయగా కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీయే కారణమని తెలుస్తోంది. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తహసీల్దార్ పాల్గొనకపోయినప్పటికి కావాలనే బదిలీ వేటు వేసినట్లు రెవెన్యూ శాఖలో చర్చ జరుగుతోంది. కల్యాణలక్ష్మి కార్యక్రమం హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరగగా ఇతర మండలాల చెక్కులు కూడా పంపిణీ చేశారు. సదరు తహసీల్దార్లను బదిలీ చేయకపోగా కేవలం హుజూరాబాద్ తహసీల్దార్‌ను బదిలీ చేయడం చర్చనీయాంఽశంగా మారింది.
టెట్ నుంచి మినహాయించాలి
జమ్మికుంట: బీఈడీ, టీటీసీ చేసి డీఎస్సీ సాఽ దించి ఏళ్లు గడిచిన తరువాత టెట్ రాయమనడం సరికాదని, పరీక్ష నుంచి సీనియర్ ఉపాధ్యాయులకు మినహయింపు ఇవ్వాలని టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మర్రి అవినాశ్ కోరా రు. జమ్మికుంట పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం విద్యరంగ సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టీపీటీఎఫ్ మండలాధ్యక్షుడు కొండపాక తిరుపతి, ప్రధాన కార్యదర్శి పాక కుమారస్వామి, గుంటి ఎల్లయ్య, శీలం సారభద్రస్వామి పాల్గొన్నారు.
నీటి వనరుల గణనపై శిక్షణ
కరీంనగర్ అర్బన్: నీటి వనరుల గణన క్రమంలో భాగంగా ఎన్యుమరేటర్లకు గురువారం శిక్షణనిచ్చారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్యుమరేటర్లకు శిక్షణనిచ్చినట్లు సీపీవో రాజారాం తెలిపారు. ఎన్యుమరేటర్లతో పాటు సూపర్‌వైజర్లకు క్షేత్రస్థాయిలో గణన తీరును వివరించారు. కాగా ఈ నెల 24నుంచి గణన ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు.
29 వరకు పీజీ పరీక్ష రుసుం చెల్లించాలి
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న అన్ని అనుబంధ కళాశాలలకు ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ కోర్సుల్లో 3వ సెమిస్టర్ ఫీజును ఈనెల 29లోపు చెల్లించాలని శాతవాహన యూనివర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి డి.సురేశ్‌కుమార్ తెలిపారు. రూ.300 అపరాధ రుసుంతో డిసెంబర్ 3వరకు అనుమతించినట్లు తెలిపారు. పరీక్షలు డిసెంబర్‌లో జరుగుతాయని తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడాలన్నారు.
ఫేస్ బయోమెట్రిక్ తప్పనిసరి


