ట్రాఫిక్ డ్యూటీకి సిద్ధం
తిమ్మాపూర్: రోడ్డు ప్రమాదాల నివారణకు ఎల్‌ఎండీ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. సీపీ గౌస్ అలం ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండలంలోని రాజీవ్ రహదారిపై ప్రమాదకరమైన మలుపులు, జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసులను పోలి ఉండే బొమ్మలను ఏర్పాటు చేశారు. నుస్తులాపూర్ నుంచి కరీంనగర్ వరకు ఉన్న ప్రధాన యూటర్న్‌లు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద 30 స్టాపర్లతోపాటు, ప్రయోగాత్మకంగా ఆరు ట్రాఫిక్ పోలీస్ బొమ్మలను ఏర్పాటు చేశారు. ప్రమాదాల నివారణకు ఈ చర్యలు చేపట్టామని ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.


