గ్రంథాలయంతో మంచి నడవడిక
కరీంనగర్ కల్చరల్: గ్రంథాలయాలతో జ్ఞానం పెంచుకోవచ్చని గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్ తెలిపారు. జిల్లా లైబ్రరీలో జరిగిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలో మాట్లాడారు. కేంద్ర గ్రంధాలయాన్ని వినియోగించుకొని ఉన్నత ప్రతిభావంతులుగా ఎదగాలన్నారు. పోటీపరీక్షల అభ్యర్థులు, పాఠకులకు మరిన్ని పుస్తకాలు తెస్తామని తెలిపారు. టీఎన్జీవో అధ్యకుడు దారం శ్రీనివాసరెడ్డి, నాయకులు సంగెం లక్ష్మణరావు, హర్మిందర్ సింగ్ మాట్లాడారు. గ్రేడ్–3 లైబ్రేరియన్ పి.నాగభూషణం నివేదిక సమర్పించారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
కొత్తపల్లి: కరీంనగర్‌లోని మహాత్మా జ్యోతిబాఫులే పార్కులో కంపెనీ పరిధిలోనే తొలిసారిగా నిర్మిస్తున్న ఇండోర్ సబ్‌స్టేషన్ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు తెలిపారు. అవుట్ డోర్ సబ్‌స్టేషన్‌కు సుమారు ఎకరం స్థలం అవసరమైతే ఇండోర్ సబ్‌స్టేషన్‌కు 4 గుంటల స్థలం సరిపోతుందన్నారు. మెట్రోపాలిటన్ నగరాలు, రద్దీ ప్రాంతాల్లో ఈ సబ్‌స్టేషన్‌తో చుట్టూ ఉన్న ప్రాంతం అధిక సాంద్రత కలిగిన రద్దీ ప్రాంతం, లోడ్ సెంటర్‌గా ఉంటుందన్నారు. విద్యుత్ సమస్యలను, తక్కువ ఓల్టేజీ, లైన్ పొడవు తగ్గడం వల్ల విద్యుత్ అంతరాయాలు నివారించడానికి, ముఖ్యంగా వేసవి కాలంలో అధిక లోడ్‌తో ఇతర విద్యుత్ సంబంధిత సమస్యలను నివారించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ముకరంపుర, బస్టాండ్, తెలంగాణచౌక్, ఐబీ చౌరస్తా, జ్యోతినగర్, సంతోష్ నగర్, మంకమ్మతోట ప్రాంతాల్లో షాపింగ్, వ్యాపారాలు, అధిక సాంద్రత కలిగిన గృహాలు ఉన్న ఈ ప్రాంతాల్లో 15 మిల్లీవాట్స్ లోడ్ అవసరం ఉండటం, భవిష్యత్‌లో లోడ్ డిమాండ్‌ను సర్దుబాటు చేయడానికి ఈ సబ్‌స్టేషన్ పనిచేయనుందన్నారు. విద్యుత్ వినియోగదారుల భవిష్యత్ అవసరాలకు ఇలాంటి ప్రాజెక్టులు అవసరమన్నారు.
గ్రంథాలయంతో మంచి నడవడిక


