
ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి
వేములవాడ: ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతామని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గుడి ఓపెన్‌స్లాబ్‌లో మంగళవారం రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్కిటెక్చర్ (వాస్తు శిల్పి) సూర్యనారాయణ మూర్తి వివరించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో భక్తుల రద్దీ అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మహాశివరాత్రి, సమ్మక్క సారలమ్మ జాతర సమయాల్లో పార్కింగ్ సమస్య రాకుండా జగిత్యాల వైపు 20 ఎకరాలు గుర్తించినట్లు తెలిపారు. 4.6 ఎకరాల్లో ఆలయ విస్తరణ, 33 ఎకరాల వరకు మాస్టర్‌ప్లాన్ డెవలప్‌మెంట్ ఏరియా ఉంటుందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి రూ.110కోట్లకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. రెండో విడతగా రూ.285కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు.ఆలయ విస్తరణ పనులు జరిగే సమయంలో భీమేశ్వర ఆలయంలో దర్శనం ఉండేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి మరో 36 గుంటల సేకరణకు చర్యలు చేపడతామన్నారు. దేవాదాయశాఖ కమిషనర్ వెంకటరావు, దేవాదాయశాఖ సలహాదారు గోవింద్‌హరి, ఆలయ ఈవో రాధాబాయి పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న ఆలయ విస్తరణపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్