
లీగల్ సర్వీసెస్ క్లినిక్ ప్రారంభం
కరీంనగర్‌క్రైం: జిల్లా కేంద్రంలోని సైనిక్‌భవన్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ సర్వీసెస్ క్లినిక్‌ను మంగళవారం రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్‌సింగ్ హైకోర్టు నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. కరీంనగర్ మొదటి అదనపు జిల్లా జడ్జి డి. వెంకటేశ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వెంకటేశ్ పాల్గొన్నారు. త్రివిధదళాలల్లో పనిచేస్తున్న, పనిచేసిన వారి కుటుంబాలకు ఉచిత న్యాయసాయం అందించేందుకు ఈ క్లినిక్‌లు ఏర్పాటు చేశారన్నారు. న్యాయవాది ఎస్వీఆర్ కృష్ణ, పారా లీగల్ వలంటీర్ సదానందం సేవలందించనున్నారు. ఏపీపీ గౌరు రాజిరెడ్డి, సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కెప్టెన్ శ్రీనివాసులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్ పాల్గొన్నారు.
‘సమాధానం చెప్పలేకే తప్పుడు ప్రచారం’
కరీంనగర్‌కార్పొరేషన్: పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మాట్లాడుతూ.. తప్పుడు ప్రచారం చేయడం, పక్క దారి పట్టించడం బండి సంజయ్‌కి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆటుపోట్లను ఎదుర్కొని పీసీసీ అధ్యక్షుడైన బీసీ నాయకుడు మహేశ్‌గౌడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయ డం బండికి తగదన్నారు. రామచంద్రాపూర్‌కా లనీలో ఎవరూ నివాసం లేని రేకులషెడ్డు ఇంటినంబర్‌పై 40 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఎండీ.తాజ్, జీడీ రమేశ్, తిరుపతి, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, అస్తాపురం రమేష్ పాల్గొన్నారు.
పూర్తయిన ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియ
కరీంనగర్: జిల్లాలో టీచర్ల పదోన్నతుల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. 64 మంది స్కూల్ అసిస్టెంట్లు గ్రేడ్–2 హెచ్‌ఎంలుగా ప్రమోషన్లు పొందారు. 157 మంది ఎస్‌జీటీ ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలుగా పదోన్నతి పొందారు. వీరంతా ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల నుంచి రిలీవ్ అయి 15రోజుల్లోగా ప్రమోషన్ పొందిన పాఠశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ, జెడ్పీ విభాగంలో పనిచేస్తున్న 57మంది ప్రమోషన్లు పొందేందుకు ఖాళీలు ఉన్న రోస్టర్ విధానం అడ్డంకులు, తగిన అర్హతలు లేకపోవడంతో ఆ పోస్టులు మిగిలిపోయాయి. గ్రేడ్–2 హెచ్‌ఎంలుగా ప్రమోషన్లు పొందిన 64 మందిలో మంగళవారం సాయంత్రం వరకు 54మంది ఆయా పాఠశాలల్లో రిపోర్టు చేసినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
క్వింటాల్ పత్తి రూ. 7,650
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో మంగళవారం క్వింటాల్ పత్తి రూ. 7,650 పలికింది. క్రయవిక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజ పర్యవేక్షించారు.

లీగల్ సర్వీసెస్ క్లినిక్ ప్రారంభం