
కరీంనగర్
బుధవారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2025
మండపానికి తరలుతున్న గోదాంగడ్డ ప్రాంతం వినాయకుడు
కరీంనగర్ టవర్ సర్కిల్ ఏరియాలో పండుగ రద్దీ
రావయ్యా..
పార్వతి తనయా
లోక నాయకుడు.. తొలి పూజలందుకునే గణనాథుడి నవరాత్రుల వేడుకకు అంతా సిద్ధమైంది. భాద్రపదమాసం శుక్ల చతుర్థి రోజు నుంచి తొమ్మిది రోజులు లంబోదరుడు పూజలందుకోనున్నాడు. వినాయక చవితి వచ్చిందంటే పల్లె, పట్టణాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. వీధివీధిలో మండపాలు భక్తులతో కళకళలాడుతుంటాయి. తొమ్మిదిరోజుల పాటు నిత్య పూజలు, భజనలు, కుంకుమపూజలు, అన్నదానం కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి. నేటి వినాయక చవితికి జిల్లా ముస్తాబైంది. వాడవాడన గణపతుల ప్రతిష్టకు మండపాలు అలంకరించబడ్డాయి. చవితి పూజలు చేసేందుకు అవసరమైన సామగ్రి కొనుగోలుదారులతో మంగళవారం కరీంనగర్‌లోని టవర్ సర్కిల్, మార్కెట్ వీధులు కిటకిటలాడాయి. పూజలో ప్రధానమైన పూలు, వినాయక ప్రతిమలు రెట్టంపు ధరలు పలికాయి. చిన్న ప్రతిమను కూడా రూ.150 నుంచి రూ.300 వరకు విక్రయించారు. వినాయకునికి సమర్పించే పత్రి, వెలక్కాయ, జాపత్రి, ఏకబిల్వం, అరటి పండ్లు, మొక్కజొన్న కంకులు, బంతిపూలు మార్కెట్‌ను ముంచెత్తాయి. బతిపూలు కిలో రూ.150 వరకు విక్రయించారు. నగరంలోని గంజ్, టవర్ సర్కిల్, శాసీ్త్రరోడ్, బోయవాడ రావిచెట్టు, గాంధీరోడ్, కోతి రాంపూర్, మంకమ్మతోట తదితర ప్రాంతాల్లో అద్భుతమైన సెట్టింగులతో మండపాలు ముస్తాబయ్యాయి. – కరీంనగర్ కల్చరల్/విద్యానగర్(కరీంనగర్)

కరీంనగర్

కరీంనగర్

కరీంనగర్