అధ్వానంగా కట్టరాంపూర్ మెయిన్ రోడ్డు
ముకరాంపురలో రోడ్డుపై గుంతలు
మారుతీనగర్‌లో రోడ్డు దుస్థితి
కరీంనగర్ కార్పొరేషన్:
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని రాకపోకలకు తిప్పలు తప్పడం లేదు. వాడవాడలా కొలువు తీరేందుకు వస్తున్న వినాయకుడి ప్రయాణం నగరంలో సాఫీగా సాగడం లేదు. సగంలో వదిలేసినవి.. అసలే పట్టించుకోనివి, వర్షాలు, వరదతో గుంతలు పడడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారి వినా యక మండపాల వారిని కలవర పెడుతున్నాయి.
గుంతల్లో ప్రయాణం
వినాయక చవితికి ఇప్పటికే నగరవ్యాప్తంగా వేలాది మండపాలు ఏర్పాటు చేశారు. బుధవారం విగ్రహాలు ప్రతిష్టించి పూజలు నిర్వహించనున్నారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రతిమలు కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. చాలా చోట్ల రోడ్లపై గుంతలు ఉండడంతో, భారీ విగ్రహాలను మండపాలకు చేర్చేందుకు నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విగ్రహాలను తీసుకొస్తున్న ట్రాక్టర్లు, ఆటోలు గుంతల రోడ్లపై ప్రయాణించడం కష్టంగా మారుతోంది. నగరంలోని కోతిరాంపూర్, కట్టరాంపూర్ మెయిన్‌రోడ్, అశోక్‌నగర్ రోడ్, జ్యోతినగర్ రోడ్, మారుతినగర్, హరిహరనగర్, బృందావన్‌కాలనీ, కిసాన్‌నగర్, రాంనగర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. చాలా చోట్ల మట్టిరోడ్లు ఉండగా, అవన్నీ గుంతలుగా మారాయి.
సొంతంగా పూడ్చుతున్న స్థానికులు
ఓ వైపు వినాయకచవితి, మరో వైపు రోడ్లపై గుంతలు దీంతో స్థానికులే రోడ్లపైగుంతలు పూడుస్తున్నారు. కొన్ని డివిజన్లలో మాజీ కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు, మండప నిర్వాహకులు, స్థానికులు సొంత ఖర్చులతో రోడ్లను చదును చేస్తున్నారు. వినాయక నిమజ్జనం నాటికి రోడ్లను చదును చేయడం, డస్ట్‌పోయడం, ప్యాచ్‌వర్క్ చేయడానికి నగరపాలక సంస్థ ఇప్పటికే టెండర్లు పిలిచింది. రూ.53 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న 24 పనులకు గాను కేవలం నాలుగింటికే స్పందన రావడంతో, మిగిలిన 20 పనులకు టెండర్‌ను 29వ తేదీ వరకు పొడిగించింది.
విఘ్నేశ్వరా.. వచ్చేదెలా.. వెళ్లేదెలా?
విఘ్నేశ్వరా.. వచ్చేదెలా.. వెళ్లేదెలా?
విఘ్నేశ్వరా.. వచ్చేదెలా.. వెళ్లేదెలా?
విఘ్నేశ్వరా.. వచ్చేదెలా.. వెళ్లేదెలా?