
రేషన్ డీలర్ల కమీషన్ ఇప్పించండి
కరీంనగర్ అర్బన్: ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకంగా పనిచేసే రేషన్ డీలర్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, 5 నెలలుగా కమీషన్ లేక నానాపాట్లు పడుతున్నామని తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్‌బాబు వాపోయారు. మంగళవారం నగరంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర కమీషన్ వేరు రాష్ట్ర కమీషన్ వేరంటూ డీలర్లకు కమీషన్ విడుదల చేయడం లేదని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కమీషన్ రాలేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం డీలర్లకు చెల్లిస్తున్న క్వింటాకు రూ.90 కమీషన్‌కు తోడుగా కనీస గౌరవ వేతనాన్ని కూడా ప్రకటించే విధంగా చూడాలని కోరారు. తెలంగాణ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు రొడ్డ శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల హన్మాండ్లు, కరీంనగర్ కార్యవర్గం గాలి గట్టయ్య, ఎ.రవీందర్, రుద్రవేణి కనుకయ్య, విజయ్ పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి సంజయ్‌కి డీలర్ల వినతి