
ఉరివేసుకుని విద్యార్థిని మృతి
గోదావరిఖని: స్థానిక అశోక్‌నగర్ చెందిన కాంపెల్లి అక్షర (17) మంగళవారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందింది. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకోగా గమనించిన కుటుంబసభ్యులు అక్షరను ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతికి గల కారణాలు తెలియాల్సిఉంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.
భార్య కాపురానికి రావడంలేదని యువకుడి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని పద్మనగర్‌కు చెందిన వేముల కరుణాకర్(35) మంగళవారం ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. కరుణాకర్ భార్య పద్మ నాలుగేళ్లుగా దూరంగా ఉంటోంది. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి కొడుకు, కూతురు ఉన్నారు. తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉరివేసుకుని విద్యార్థిని మృతి