
భక్తులపై నీళ్లు చల్లే ‘గణేశుడు’
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడలో కొలువుదీరే గడ్డి గణేశుడు తన తొండం నుంచి భక్తులపై నీళ్లు చల్లడం ఇక్కడి ప్రత్యేకత. 49 ఏళ్ల క్రితం గడ్డి, బట్ట, వెదురుకర్రలతో తయారు చేయడం మొదలు.. ఇప్పటికీ అదే రీతిన భారీ ఆకారంలో గణేశుడిని తీర్చిదిద్దుతున్నారు. పర్యావరణ హితం కోసం గడ్డి వినాయకుడిని తయారు చేసుకుని ఉత్సవాలు జరుపుకుంటున్నామని కాలనీవాసులు పేర్కొన్నారు.
గడ్డి వినాయకుడికే పూజలు
తెనుగువాడలో విఠల్ అనే వ్యక్తి తొలిసారి గడ్డితో వినాయకుడిని తయారుచేశాడు. తర్వాత తమ కాలనీకే చెందిన బూతగడ్డ మధునయ్య, గరిగంటి మల్లయ్య ఆ బాధ్యతలు తీసుకున్నారు. తమ వినాయకుడి తయారీలో ప్రకృతి సిద్ధంగా దొరికే సామగ్రి వాడుతాం.
– కొలిపాక రాయలింగు, పెద్దపల్లి

భక్తులపై నీళ్లు చల్లే ‘గణేశుడు’