
గడపగడపకు..
సిరిసిల్లటౌన్: పట్టణంలోని 24వ వార్డులో వ్యాపారవేత్త, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్ ఆధ్వర్యంలో 50 మందితో శ్రీనిధి పరస్పర సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. 15 ఏళ్లుగా సంఘం ఆధ్వర్యంలో వార్డులోని 350 ఇళ్లకు మట్టి వినాయకులను అందిస్తున్నారు. అలాగే స్థానిక శివనగర్ రాజరాజేశ్వరస్వామి ఆలయం వేదికగా ఏడాదికి 2 వేల వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజాప్రతినిధులు గోశికొండ హన్మంత్ పంతులు, బూర కిష్టయ్య తదితరులు ఈ భగవత్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇప్పటి వరకు 20 వేల విగ్రహాలను పంపిణీ చేశారు.