
సంప్రదాయానికి పెద్దపీట
సిరిసిల్లటౌన్: మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను కొలవడం సంప్రదాయమని మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో గోదావరి పాలిమర్స్, సంతోష్ ఎలక్ట్రికల్ ప్రతినిధులు పదేళ్లుగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. ఏటా సిరిసిల్ల కోర్టు ముందు వెయ్యి నుంచి 2 వేల విగ్రహాల వరకు ఉచితంగా అందిస్తున్నారు. మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు భాస్కర్ నేతృత్వంలో పర్యావరణ రక్షణకు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. నిమజ్జన వేడుకల్లో వాటర్, చల్లా ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. మట్టి విగ్రహాల పంపిణీకి ఇప్పటి వరకు రూ.లక్షకుపైగా వెచ్చించినట్లు నిర్వాహకులు తెలిపారు.