
ఏటా వెయ్యి విగ్రహాలు
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వివిఽ ద గ్రామాల భక్తులకు నలమాచు శ్రీనివాస్ శైలజ దంపతులు 18 ఏళ్లుగా ఏటా వెయ్యి మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. పిల్లలకు మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం వల్ల వారు మట్టి వినాయకులనే మండపాలలో ప్రతిష్టించి పూజించాలనే అవగాహనకు వస్తారని శ్రీనివాస్ తెలిపారు.
త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో..
జ్యోతినగర్(రామగుండం): పర్యావరణ పరిరక్షణకు తాము సైతం అంటూ ఏటా మట్టి వినాయకుడి విగ్రహాలతో ఉత్సవాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్టీపీసీ రామగుండం అ న్నపూర్ణకాలనీలో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఈసారి 15 ఫీట్ల వినాయకుడిని ప్రతిష్టించనున్నారు. మట్టి వినాయకుడిని పూ జించి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నారు.