
ముదురుతున్న క్రిప్టోయాప్స్
నెక్ట్స్‌బిట్ నిర్వాహకుడి అరెస్టులో కొత్త కోణం హిమాన్షు గురించి ఉప్పందించింది పోటీ యాప్ నిర్వాహకులే జగిత్యాలవాసులను వెంటేసుకుని హైదరాబాద్‌కు వెళ్లి ఫిర్యాదు నిందితుడిని అరెస్టు చేసేవరకూ పోలీసుల వెన్నంటే ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదుతోనే కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు కుప్పలుగా పుట్టుకొస్తున్న యాప్‌లు.. ష్యూరిటీగా పొలాలు, స్థలాలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ దందా పెరుగుతోంది. అనతికాలంలోనే రూ.కోట్ల లాభాలు అంటూ అమాయకులకు ఆశచూపి.. విదేశీ ప్రయాణాలు ఎరవేసి.. వారి నుంచి రూ.లక్షలు గుంజుతున్న యాప్‌ల సంఖ్య పెరిగిపోతోంది. మార్కెట్‌లో వీటిని నియంత్రించే మెకానిజం ఏదీ లేకపోవడంతో కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా వీటి మధ్య ఆధిపత్య పోరు కూడా సాగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో నెక్ట్స్ బిట్ అనే క్రిప్టో కరెన్సీగా చలామణి అవుతున్న ఓ యాప్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. ఈ విషయంలో రాచకొండ పోలీసులను అంతా అభినందించారు. అయితే.. ఈ అరెస్టు వెనుక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం పోలీసు యాక్షన్ అంతా నెక్ట్స్‌బిట్ వ్యతిరేక యాప్ వర్గం వాళ్లు చెప్పినట్లు సాగిందని జగిత్యాలలో ప్రచారం సాగుతోంది.
వాస్తవానికి నెక్ట్స్‌బిట్ ప్రవేశించేందుకు ముందు.. డజనువరకు యాప్‌లు అక్కడ దందా చేస్తున్నాయి. వీరంతా జనాలను నమ్మించేందుకు ఒకరిని మించి మరొకరు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని యాప్‌లు జనాల నుంచి డబ్బులు వసూలు చేసి అదృశ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త యాప్‌లను అంత తేలిగ్గా నమ్మడం లేదు. అందుకే వీరి పెట్టుబడికి ఆస్తల ను ష్యూరిటీగా ఇస్తున్నారు. ఉదాహరణకు వీరు ఐదు నుంచి పది మంది పెట్టుబడిదారులను ఒక గ్రూపుగా పోగుచేస్తారు. వీరికి నమ్మకం కలిగేలా రూ.20 లక్షలు కూడా చేయని భూమికి రూ.50 లక్షలు అని చెప్పి.. బాధితుల నుంచి అంతమేరకు డబ్బును క్రిప్టో పేరిట వసూలు చేస్తారు. ఆ డబ్బుకు సమాన విలువ అంటూ కొన్ని డాలర్లను వారి ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్‌కు పంపుతారు. ఇటు యాప్‌లో ఉన్న డాలర్లను, అటు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన భూములను ష్యూరిటీగా చూసుకుని మురిసిపోతున్నారు. తమ పెట్టుబడి పెట్టిన డబ్బు తిరిగి రాదని, తాము కొన్న భూమికి అంత విలువలేదన్న విషయం వీరు గ్రహించే సరికి నిర్వాహకులు ఆ డబ్బును లక్కీభాస్కర్ సినిమాలో మాదిరిగా దేశం దాటిస్తున్నారు. ఇటీవల జీబీఆర్ క్రిప్టో కరెన్సీపేరిట రూ.95 కోట్లు, మెటాపేరిట రూ.100 కోట్లు, నెక్ట్స్‌బిట్ పేరిట రూ.19 కోట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత ఉంటుంది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలతో పోలిస్తే పెద్దపల్లిలో బాధితుల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తమ కంటే అధిక వ్యాపారం చేస్తున్నాడన్న కోపంతో వ్యతిరేక యాప్ వారే.. హిమాన్షు అరెస్టులో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో క్రిప్టో కరెన్సీ పేరిట అనేక యాప్‌లు నడుస్తున్నా.. ఎలాంటి ఫిర్యాదూ లేకుండా విశ్వసనీయ సమాచారంతో అరెస్టు చేసింది ఈ ఒక్క కేసులోనే కావడం గమనార్హం. ఇందుకోసం నెక్ట్స్‌బిట్ పోటీదారైన యాప్ స్వయంగా రంగంలో కి దిగింది. నెక్ట్స్‌బిట్ యాప్‌కు సంబంధించిన కొందరు బాధితులను వెంటేసుకుని రాచకొండలోని మే డిపల్లి పోలీసులను ఆశ్రయించారు. వీరిచ్చిన సమాచారంతోనే పోలీసులు ఓ హోటల్‌లో తమ యాప్ ను ప్రమోట్ చేసుకుంటున్న హిమాన్షును అరెస్టు చేశారు. అతని అరెస్టు తతంగం అయ్యేవరకూ పో టీదారు యాప్ నిర్వాహకుల ప్రతినిధులు అక్కడే ఉండటం కొసమెరుపు. దాదాపు 400 మంది వద్ద రూ.19కోట్ల మేరకు మోసం చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ క్రిప్టోదందా సాగుతోంది. ఈ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నా.. కేసు పెట్టేందుకు పోలీసులు సహకరించడం లేదు. అన్ని జిల్లాల్లోనూ ఈ వ్యవహారంపై ఇంటలిజెన్స్ ఎప్పటికపుడు డీజీపీకి.. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తూనే ఉంది. అయినప్పటికీ ఒక్క రాచకొండ కమిషనరేట్‌లో మాత్రమే పోలీసులు స్వయంగా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించడం గమనార్హం. ఈ మొత్తం ఆపరేషన్ వెనక నెక్ట్స్‌బిట్ పోటీదారులే ఉన్నారని జగిత్యాల వాసులు ఆరోపిస్తున్నారు.
ఎలా చేస్తున్నారు..?
అసలేం జరిగింది..?