
ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలో దొంగతనం
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండల కేంద్ర శివారులోని దీక్షిత ఇండేన్ గ్యాస్ ఏజేన్సీలో శనివారం రాత్రి దొంగతనం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఈ ఏజెన్సీలో దొంగతనానికి పాల్పడ్డ దొంగ ముందుగా సీసీ కెమెరా తీగ, కరెంట్ ఫ్యూజ్ తొలగించాడు. ఏజెన్సీ కార్యాలయ గొళ్లాన్ని ఇనుప రాడు సహాయంతో తొలగించి కార్యాలయంలో ఉన్న రూ.7వేల నగదు, రశీదు పుస్తకాలను మాయం చేశాడు. చందుర్తి ఎస్సై రమేశ్‌ను వివరణ కోరగా.. నిజమేనని, రూ.7వేల నగదు, రశీదు పుస్తకాలు మాయమైనట్లు తెలిపారు.
5 రోజుల క్రితం మర్రిగడ్డ పాఠశాలలో..
మర్రిగడ్డ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. మధ్యాహ్న వంట గదిలోని సిలిండర్, 2 వంట పాత్రలు, వాటి మూతలను ఎత్తుకెళ్లారని ఈనెల 12న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినయ్‌కుమార్ చందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం చందుర్తి పోలీసులు బయటకు రానివ్వలేదు.