
నెల రోజులుగా ఇబ్బందులు
త్రిఫ్ట్ ఫండ్ డబ్బుల కోసం కార్మికులు నెల రోజులుగా తిరుగుతున్నారు. మీ పొదుపు డబ్బులు తప్ప.. ప్రభుత్వ వాటా జమ కాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. చేనేత, జౌళిశాఖ కార్యాలయానికి వెళ్తే సరైన సమాధానం లేదు. స్కూల్ ఫీజులు, పండుగల నేపథ్యంలో నేతన్నలకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నాయి. వెంటనే త్రిఫ్ట్ ఫండ్ నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – మూషం రమేశ్, పవర్‌లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
త్రిఫ్ట్ ఫండ్ పథకం నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల చేతుల మీదుగా నేతన్న బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్మికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. తప్పకుండా వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి.
– రాఘవరావు, చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు, సిరిసిల్ల

నెల రోజులుగా ఇబ్బందులు