
గుండెపోటుతో వడ్రంగి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్‌కు చెందిన న్యాలపల్లి అజ య్(46) అనే వడ్రంగి కుడు ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. సొంతంగా ఇల్లు కట్టుకోడానికి రూ.2లక్షల అప్పు చేశాడు. మహిళా సంఘంలో మరో రూ.2లక్షలు, అందినకాడల్లా రూ.4లక్షలు అప్పులు చేసి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశాడు. అప్పులు తెచ్చిన చోట మి త్తితో కలిపి అవి రూ.13లక్షల వరకు అయ్యాయి. వ డ్రంగి పని చేసుకునే అజయ్ వచ్చిన కూలి డబ్బులతో అప్పులు తీర్చే మార్గం కానరాలేదు. దీంతో మనస్తాపంతో గుండెపోటుకు గురయ్యాడు. మృతుడికి భార్య రమాదేవి, కుమారులు కృష్ణచైతన్య, బనిత్, కూతురు శ్రీజ ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్ర భుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

గుండెపోటుతో వడ్రంగి మృతి