
ప్రమాదవశాత్తు తాపీమేసీ్త్ర మృతి
మానకొండూర్: మండల కేంద్రానికి చెందిన కొండ్ర రమేశ్(50) అనే తాపీమేసీ్త్ర ప్రమాదవశాత్తు ఆదివారం మృతిచెందాడు. మానకొండూర్ సీఐ సంజీవ్ వివరాల ప్రకారం.. రమేశ్ ఆదివారం శ్రీనివాస్‌నగర్‌లో ఓ నూతన గృహ నిర్మాణంలో భాగంగా తాపీమేసీ్త్రగా వెళ్లాడు. పిల్లర్ బాక్స్‌లో సిమెంట్ కంకర నింపేందుకు నిచ్చెన పైకి ఎక్కి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి గాయాలపాలయ్యాడు. వెంటనే కరీంనగర్‌లోని ఆసుపత్రికి స్థానికులు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరందరికీ వివాహమైనట్లు పోలీసులు తెలిపారు.