
కొనసాగుతున్న ఎత్తిపోతలు
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంప్‌హౌస్ నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరగడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నంది పంప్‌హౌస్‌లోని నీటిని తరలిస్తూ నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక్కో పంపు ద్వారా 3,150 క్యూసెక్కులు, నాలుగు పంపుల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్‌లోకి, అక్కడి నుంచి సొరంగాల ద్వారా లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌లోకి తరలిస్తున్నారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు పంపులను కొనసాగించిన అధికారులు ఒక్క పంపును ఆఫ్‌చేసి మూడు పంపుల నుంచి ఎత్తిపోతలు కొనసాగిస్తున్నట్లు ఏఈఈ వెంకట్ తెలిపారు.