
బేతిగల్‌కు జాండీస్
వీణవంక(హుజూరాబాద్): ఆ ఊరు జాండీస్ (పచ్చకామెర్లు)తో వణికిపోతుంది. ఒకరిద్దరు కాదు 15 రోజుల వ్యవధిలో సుమారు 60 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో జాండీస్ వ్యాప్తి చెందడం గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరడంతో రూ.వేలలో ఖర్చు అవుతున్నాయని బాధితులు వాపోతున్నారు. 2వ వార్డులోని ఓ ఇంట్లో తండ్రితో పాటు, కూతురు, కుమారుడికి జాండీస్ రావడంతో రూ.40 వేలు ఖర్చు అయ్యాయని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామస్తులు వ్యాధి బారిన పడుతున్నా ఇప్పటి వరకు వైద్యాధికారులు సందర్శించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కలుషిత నీరే కారణమా..?
గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నాయి. వాటిని వంట, స్నానం, తాగడానికి వినియోగిస్తున్నారు. ఈ నీళ్లు కలుషితం కావడంతోనే వ్యాధి ప్రబలుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాటర్ ప్లాంట్ నీళ్లు కూడా వ్యాధికి కారణమని మరికొంత మంది గ్రామస్తులు పేర్కొంటున్నారు. జ్వరం వచ్చి ఆసుపత్రిలో చేరుతున్నారు. తీరా వైద్యాధికారులు పరీక్షలు చేయడంతో జాండీస్‌తో పాటు ప్లేట్‌లెట్స్ కూడా పూర్తిగా తగ్గిపోవడం గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికై నా గ్రామంలో వైద్య సిబ్బంది పర్యటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను గ్రామస్తులు కోరుతున్నారు.
పది రోజుల క్రితం జ్వరం రావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన. డాక్టర్లు టెస్టు చేస్తే జాండీస్ 9.1 రేంజ్‌లో ఉందని రిపోర్టు వచ్చింది. ఇప్పటి వరకు రూ.40వేలు ఖర్చయ్యాయి. అయినా తగ్గకపోవడంతో కరీంనగర్‌కు రెఫర్ చేశారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా నయం కావడం లేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. డాక్టర్లను అడిగితే ఊర్లో నీళ్లు కలుిషితం అవుతున్నాయని చెబుతున్నారు.
– శ్రీ సాయి, యువకుడు, బేతిగల్
వ్యాధి వ్యాప్తిపై గ్రామస్తుల ఆందోళన
పట్టించుకోని వైద్యసిబ్బంది

బేతిగల్‌కు జాండీస్