
అజయ్‌ని బతికించారు
వీణవంక: వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన బొంగోని అజయ్(26) వినాయకుడి విగ్రహాల తయారీలో కూలీ పనికి వెళ్లగా విగ్రహం మీదపడటంతో మెడనరాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆయన దీనస్థితిని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. జూలై 16న ‘నిరుపేదకు పెద్ద కష్టం’ కథనం ప్రచురితమైంది. స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహా అజయ్ పరిస్థితిపై వాకబు చేశారు. చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించాలని ఆదేశించారు. నెల రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందిన ఆజయ్‌కి శుక్రవారం ఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా శ్రీసాక్షిశ్రీకి అజయ్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఆపరేషన్ తర్వాత మూడు నెలల పాటు ఫిజియోథెరఫి చేయించాలి. దీని కోసం డిహాబిటేషన్ సెంటర్‌లో ఉంచాలి. రోజుకు రూ.38,00 ఖర్చు అవుతుంది. ఈ మూడు నెలలు అజయ్‌కి కీలకం. ఈ సమయంలో ఎంత ఫిజియోథెరిఫి చేపిస్తే అంత తొందరగా కోలుకునే పరిస్థితి ఉంటుందని నిమ్స్ వైద్యులు చెప్పుతున్నారు. పేద కుటుంబం కాబట్టి దాతలు సహకరిస్తే అజయ్ పూర్తిస్థాయిలో కోలుకుంటాడని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. సాయం చేయాల్సినవారు ఫోన్ నంబర్ 97013 14308ను సంప్రదించాలని కోరుతున్నారు.

అజయ్‌ని బతికించారు