
అనభేరికి నివాళి
కరీంనగర్: స్వాతంత్య్ర సమరయోధుడు అనభేరి ప్రభాకర్ రావు 116వ జయంతి సందర్భంగా శుక్రవారం కరీంనగర్‌లోని ఆయన విగ్రహానికి కుటుంబ సభ్యులు సల్వాజీ వాసంతి, తుల మధుసూదన్ రావుతోపాటు దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు మార్వాడి సుదర్శన్‌ు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రభాకర్‌రావు లాంటి వీరుల త్యాగాల ఫలితమే ఈనాటి స్వాతంత్రోత్సవ సంబరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అనభేరి కుటుంబ సభ్యులు శౌర్యరావు, ధైర్యరావు, తో పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు దండు అంజయ్య, వరలక్ష్మి, వాణి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు అసంపల్లి వినయ్ సాగర్, కెవిపిఎస్ నాయకుడు పులిపాక సాయికుమార్, పీడీఎస్‌యూ నాయకుడు కుమార్, భీమ్ ఆర్మీ నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.
విగ్రహాంఏర్పాటు చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: నిజాం నిరంకుశత్వంపై పోరాడి అసువులు బాసిన తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు అన భేరి ప్రభాకర్‌రావు కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేయాలని ఎల్లాపి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ స్వాతంత్య్రం కోసం పోరాడిన అనభేరి నిజాం రజాకర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయాడని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎల్లాపి సంఘం నాయకులు లక్కాకుల సురెందర్‌రావు, పెంచాల కిషన్‌రావు, అన భేరి యుగంధర్‌రావు, బాలసంకుల అనంతరావు,మాదాసు మోహన్‌రావు, సాయిని జనార్ధనణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.