
‘తెలంగాణ’ ఏర్పాటుతోనే రాష్ట్రాభివృద్ధి
కొత్తపల్లి(కరీంనగర్): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమైందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. చింతకుంటలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాతీయ పతాకం ఎగురువేసి మాట్లాడారు. మనదేశానికి స్వాతంత్రం వచ్చి 79ఏళ్లు గడిచిందని, ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో మనరాష్ట్రం ఏర్పడడం ఒక మైలురాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ప్రస్తుతం మనదేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారకు ఇందుకు తొలి సీఎం కేసీఆరే అని తెలిపారు. ప్రభుత్వాలు ఏవైనా.. ప్రజాసంక్షేమం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్ర రాజు, నాయకులు పాల్గొన్నారు.