
మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు
సైదాపూర్: ఏ పంటకై నా మోతాదుకు మించిన రసాయన ఎరువులు వాడొద్దని ఇఫ్కో కంపెనీ కరీంనగర్ జిల్లా మేనేజర్ బాలాజీ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని విశాల సహకార సంఘం ఆవరణలో జైజవాన్, జైకిసాన్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్మీలో పని చేసి రిటైరైన జవాన్లను ఇఫ్కో కంపెనీ ప్రతినిధులు సన్మానించారు. అనంతరం రసాయన ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. జిల్లాలో ఎక్కువ రకాల పంటలు సాగు చేస్తున్న మండలాల్లో గంగాధర, ఇల్లందకుంట, సైదాపూర్ మండలాలున్నాయన్నారు. అన్ని రకాల పంటల సాగు రైతుకు శ్రేయస్కరమని అన్నారు. అధికంగా యూరియా వాడితే చీడపీడలు ఎక్కువగా వస్తాయన్నారు. నానో యూరియా, డీఏపీ మందులతో కలిపి వాడొచ్చని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, సింగిల్‌విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బెదరకోట రవీందర్, మాజీ సర్పంచులు గుండారపు శ్రీనివాస్, కొండ గణేశ్, విద్వాన్‌రెడ్డి ఉన్నారు.