
రాజకీయాల్లో ప్రాధాన్యమివ్వాలి
రాజకీయాల్లో మహిళలు, అందులో యువతకు ఎక్కువగా ప్రాధాన్యం ఉండాలి. ఇప్పటికీ మహిళలు గెలిచిన స్థానాల్లోవారి కుటుంబసభ్యుల్లోని మగవారే పెత్తనం చెలాయిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మహిళల స్థానాల్లో వారే పరిపాలించేలా చూడాలి.
– అర్చన, బీకాం, వీణవంక
అత్యుత్తమ టెక్నాలజీ ఉన్న భారతదేశ సైన్యాన్ని చూసి ప్రపంచమే వణికిపోతోంది. యుద్ధ విమానాలు, ఇతర దాడులు చేసే క్షిపణుల వ్యవస్థను మరింత పటిష్టపరిచి శత్రుదేశాలు మన గురించి ఆలోచించాలంటే వణుకుపుట్టేలా భారత సైన్యాన్ని సిద్ధం చేయాలి.
– ఆర్.నీలిమ, కరీంనగర్
2047నాటికి దేశం ఆగ్రస్థానంలో నిలవాలంటే రాజకీయాల్లోకి చదువుకున్న వారు రావాలి. ఐఏఎస్, ఐపీఎస్‌లను ఎలా ఎంపిక చేస్తున్నారో, రాజకీయాల్లోనూ అత్యుత్తమ వ్యక్తులను ఎంపిక చేయాలి. వారి చేతిలో డిజిటల్ ఇండియా ముందుకు సాగుతుంది.
– అబ్దుల్ రహమాన్, సీఎస్‌ఈ
ఫైనలియర్, కిట్స్
భారతదేశం 2047నాటికి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలంటే ప్రతిఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. వైద్యరంగంలో టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తే అందరం ఆరోగ్యంగా ఉండి దేశాన్ని ఆగ్రస్థానంలో నిలపొచ్చు. ఉచిత వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
– అభిలాష్, సివిల్ ఫైనలియర్, కిట్స్

రాజకీయాల్లో ప్రాధాన్యమివ్వాలి

రాజకీయాల్లో ప్రాధాన్యమివ్వాలి

రాజకీయాల్లో ప్రాధాన్యమివ్వాలి