దేశవ్యాప్తంగా చదువుల్లో, కొలువుల్లో రిజర్వేషన్లు తీసివేయాలి. ప్రతిభ ఆధారంగా విద్యాసంస్థల్లో సీట్లు, చదువు పూర్తయిన తరువాత ఉద్యోగాలు ఇచ్చేలా వ్యవస్థ ఉండాలి. మిగితా విషయాల్లో పథకాలు ఎలా ఉన్నా, చదువుల్లో అర్హతకు ప్రాధాన్యం ఇవ్వాలి.
– అన్నపూర్ణ, బీఎస్సీ, ఆదిలాబాద్
భారతీయ చట్టాలకు ఇంకా పదును పెట్టాలి. మహిళలపై నేరాల్లో విదేశాల్లో కఠిన శిక్షలు ఉన్నట్లే మన దేశంలోనూ అమలు చేయాలి. ఇలా చేస్తే నేరం చేసే ఆలోచన కూడా రాదు. శిక్షలు కూడా త్వరగా పడేలా న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ పనిచేయాలి.
– వైడూర్య, బీఏ, పెద్దపల్లి
విద్యలో, టెక్నాలజీలో మనదేశం అభివృద్ధి చెందాలి. వైద్యానికి, చదువుకు అయ్యే ఫీజులు తగ్గించాలి. పేద విద్యార్థులకు వైద్య కోర్సులు కలగానే మిగిలిపోతున్నాయి. ప్రభుత్వం విద్య, వైద్యం తప్ప మిగితా పథకాలకు ప్రాధాన్యం తగ్గించినా ఫర్వాలేదు.
కె.అలేఖ్య, బీఎస్సీ, మానకొండూర్
ప్రస్తుతానికి దేశాన్ని పీడించి ప్రధాన సమస్యల్లో డ్రగ్స్ ఒకటి. ఎంత కంట్రోల్ చేసినా రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం పోలీసు, ఇతర వ్యవస్థలు దృష్టి సారించి డ్రగ్స్, నిషేధిత మత్తు పదార్థాలపై లోతుగా విచారించాలి. డ్రగ్స్ కట్టడికి కృషి చేయాలి.
– ఎ.మహేశ్, బీఎస్సీ, కరీంనగర్
చదువుల్లో రిజర్వేషన్లు వద్దు
చదువుల్లో రిజర్వేషన్లు వద్దు
చదువుల్లో రిజర్వేషన్లు వద్దు