
రైళ్ల హాల్టింగ్ పునరుద్ధరణ
రామగుండం: పెద్దపల్లి, రామగుండం రైల్వేస్టేషన్లలో గతంలో రద్దు చేసిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్‌ను ఈనెల 15న పునరుద్ధరించనున్నట్లు ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు కంకటి ఫణి గురువారం తెలిపారు. ఐఆర్‌సీటీసీ రైల్వే పోర్టల్‌లోపై వాటి రాకపోకలు, హాల్టింగ్ మార్పును అప్‌డేట్ చేయనున్నట్లు వెల్లడించారు.
హాల్టింగ్ పునరుద్ధరణ ఇలా..
రైలు నంబరు : 12656 : చైన్నె సెంట్రల్–అసర్వ జంక్షన్ (నవజీవన్ సూపర్‌ఫాస్ట్): పెద్దపల్లి జంక్షన్‌కు రాత్రి 8.59 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో(12655) సాయంత్రం 4.45గంటలకు చేరుకుంటుంది.
రైలు నంబరు : 22737 : సికింద్రాబాద్–హిస్సార్ (హిస్సార్ సూపర్‌ఫాస్ట్): ప్రతీ మంగళ, బుధవారాల్లో పెద్దపల్లి జంక్షన్‌కు వేకువజామున 2.34గంటలకు చేరుకుంటుంది. దీనికి ఈనెల 19 నుంచి హాల్టింగ్ ఉంటుంది.
రైలు నంబరు : 17005 : హైదరాబాద్–రక్సోల్ (రక్సోల్ సూపర్‌ఫాస్ట్): ప్రతీ గురువారం వేకువజామున 2.34గంటలకు పెద్దపల్లి జంక్షన్‌కు చేరుకుంటుంది. ఈనెల 21 నుంచి పెద్దపల్లి జంక్షన్‌లో హాల్టింగ్ ఉంటుంది.
రైలు నంబరు : 17006 : రక్సోల్ –హైదరాబాద్ (రక్సోల్ సూపర్‌ఫాస్ట్): ప్రతీ ఆదివారం రాత్రి 11.59గంటలకు పెద్దపల్లి జంక్షన్‌కు చేరుకుంటుంది. ఈనెల 17 నుంచి హాల్టింగ్ ఉంటుంది.
రైలు నంబరు : 12295 : బెంగళూరు–దాణాపూర్ (సంఘమిత్ర సూపర్‌ఫాస్ట్): ప్రతీరోజు వేకువజామున 2.09గంటలకు రామగుండం రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. శుక్రవారం నుంచి హాల్టింగ్ ఉంటుంది.