
నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యమివ్వాలి
కరీంనగర్ కార్పొరేషన్: నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50శాతం ఇచ్చేలా చూడాలని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న కోరారు. మహిళా కాంగ్రెస్ సమావేశం డీసీసీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డవారికి వచ్చే స్థానిక సంస్థల ఎన్ని కల్లో పార్టీ టికెట్లు ఇవ్వాలన్నారు. గ్రామ, మండల, బ్లాక్ కమిటీలు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌లోగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులపై విస్తృత ప్రాచుర్యం కల్పించాలన్నా రు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య,రాష్ట్ర కార్యదర్శి వంగల కల్యాణి పాల్గొన్నారు.
ఏరియా ఆస్పత్రి సందర్శన
హుజూరాబాద్: పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ప్రపంచ బ్యాంకు బృంద సభ్యులు మంగళవారం సందర్శించారు. ఆసుపత్రిలో అసంక్రమిక వ్యాధులకు అందుతున్న వైద్య సేవలను గురించి సిబ్బందితో చర్చించి, పలు సూచనలు చేశారు. జిల్లా క్వాలిటీ మేనేజర్ సాగర్ ఆధ్వర్యంలో ఫైర్‌సేఫ్టీ మాక్ డ్రిల్ నిర్వహించి, విపత్తుల సమయంలో తీసుకోవా ల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రభుత్వ ఏరి యా ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణరెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.
గడువు ముగిసిన వస్తువులు విక్రయం
కరీంనగర్ అర్బన్: వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త. కొనుగోలు చేసే వస్తువులకు గడువుందో లేదో ఒకసారి చూడండి మరీ. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తనిఖీల్లో గడువు ముగిసిన వస్తువులను విక్రయిస్తున్నారని స్పష్టమవడం ఆందోళనకు తావిస్తోంది. నగరంలోని కమాన్‌చౌరస్తాలో గల ఓ మార్ట్‌లో గడువు ముగిసిన వస్తువులు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో మంగళవా రం ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ అంకిత్‌రెడ్డి తనిఖీ చేశా రు. పలు వస్తువులు గడువు ముగిసినవిగా గుర్తించి ధ్వంసం చేయించారు. చాలా రకాల వస్తువులు మరో 2నుంచి 7రోజుల వ్యవధిలో గడువు ముగిసేవిగా గుర్తించి, యాజమాన్యానికి నోటీస్ అందజేసినట్లు అంకిత్ తెలిపారు.
బీఎల్‌వోల గౌరవ వేతనం రెట్టింపు
కరీంనగర్ అర్బన్: ఎన్నికలంటే గుర్తొచ్చేది పోలింగ్ కేంద్రం, పోలింగ్ అధికారులు. ఓటర్ల జాబితా రూపకల్పనలో బీఎల్‌వోల పాత్ర కీలకం. ఎక్కువగా అంగన్‌వాడీ టీచర్లు, ఆశాకార్యకర్తలు, మహిళా సంఘాల సీఎలు బీఎల్‌వో పాత్రను నిర్వహిస్తున్నారు. యేటా ఓటర్ల జాబితా తయారీ కత్తిమీద సామే. వీరి సేవలను గుర్తించిన ఎన్నికల సంఘం గౌరవ వేతనాన్ని పెంచింది. ఇప్పటివరకు ఏడాదికి రూ.6వేలను గౌరవ వేతనంగా చెల్లించేవారు. దాన్ని తాజాగా రూ.12వేలకు పెంచారు. సూపర్‌వైజర్లకు రూ.12వేల నుంచి రూ.18వేలకు పెంచారు. ఓటర్ల జాబితా సవరణకు అందించే పారితోషికాన్ని రూ.వెయ్యి నుంచి రూ.2 వేల కు పెంచాలని నిర్ణయించారు. ఎలక్టోరల్ అధి కారులు, సహాయ ఎలక్టోరల్ అధికారులకు కూడా గౌరవ వేతనం చెల్లించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఉత్తర్వులతో జిల్లాలో 1,342మందికి లబ్ధి కలగనుంది.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ వైర్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు కొనసాగుతున్నందున బుధవారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు 11 కె.వీ.అల్కాపురి కాలనీ పరిధిలోని అల్కాపురి, శ్మశానవాటిక, గిద్దె పెరుమాండ్ల ఆలయం, కోతిరాంపూర్, విజేత అపార్ట్‌మెంట్, 11 కేవీ.శివనగర్ ఫీడర్ పరిధిలోని సప్తగిరికాలనీ, ప్రగతినగర్, టెలిఫోన్ క్వార్ట్టర్లు, శివనగర్, మార్కండేయకాలనీ ప్రాంతాలతో పాటు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కె.వీ.తెలంగాణ చౌక్ ఫీడర్ పరిధిలోని శ్రీనగర్‌కాలనీ, ప్రభుత్వ మహిళా కళాశాల, కశ్మీర్‌గడ్డ, శాలిమార్ ఫంక్షన్ హాల్‌లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.

నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యమివ్వాలి