
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సిద్ధమవుతున్న మట్టి గణపతులు
చవితి పండుగ వచ్చేస్తోంది. సంబరాలు తెచ్చేస్తోంది. మరో పక్షం రోజుల్లో గణనాథుడు వాడవాడన కొలువుదీరనున్నాడు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటుండగా.. ముందస్తు బుకింగ్‌లు కొనసాగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కరీంనగర్ శివారు బొమ్మకల్ వద్ద మట్టి ప్రతిమలు తయారు చేస్తున్నారు. ఎకో గణపతులను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. చిన్న ప్రతిమ నుంచి పెద్దపెద్ద విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తున్నారు. రూ.2,500 నుంచి రూ.లక్షన్నర వరకు ధర పలికే విగ్రహాలు ఉన్నాయని చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ముందస్తు బుకింగ్‌లు చేసుకుంటున్నారని తయారీదారులు తెలిపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్
న్యూస్‌రీల్

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025