
నూతన భవనంలోకి ‘సైన్స్‌వింగ్’
కరీంనగర్: కార్ఖానగడ్డలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల( సైన్స్‌వింగ్)లో నిర్మించిన నూతన భవనంలో తరగతులు ప్రారంభించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కళాశాలను సందర్శించారు. మరమ్మతు పనులను పరిశీలించారు. కళాశాల ప్రాంగణంలో ఉన్న స్క్రాప్ తొలగించాలని ఆదేశించారు. శిఽథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించాలన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.15 లక్షలు విద్యార్థులకు టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు, అత్యవసర మరమ్మతుల కోసం వినియోగించాలని అన్నారు. నూతన భవనంలో తరగతులు ప్రారంభించేందుకు అవసరమైన డోర్లు, కిటికీలు, బ్లాక్ బోర్డులు, ఫర్నిచర్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రిన్సిపాల్ వెంకటరమణచారి ఉన్నారు.
‘స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్’లో పాల్గొనాలి
కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్‌లో జిల్లాలోని అన్ని పాఠశాలలు పాల్గొనాలని కలెక్టర్ పమేలా సత్పతి సూ చించారు. స్వచ్ఛ హరిత విద్యాలయ నమోదు, బుధవారం బోధన, ఇంగ్లిష్ క్లబ్ అంశాలపై మండల విద్యాధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పాఠశాలల్లో టాయిలెట్లు, తాగునీరు తదితర వివరాలు స్వచ్ఛ హరిత విద్యాలయ యాప్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో కేంద్ర బృందం పరి శీలించి పాఠశాలలకు ర్యాంకు ఇస్తుందని తెలిపారు. విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగుతో పాటు సబ్జెక్టుల్లో మరింతగా రాణించేందుకు ‘బుధవారం బోధన’ జిల్లావ్యాప్తంగా అమలు చేయాలన్నారు. సందేశాత్మక చిత్రాలు చూపిస్తూ రివ్యూలు రాయించాలని తెలిపారు. యూనిసెఫ్ జిల్లా సమన్వయకర్త కిషన్ స్వామి, స్వచ్ఛభారత్ సమన్వయకర్త వేణు ప్రసాద్, విద్యాశాఖ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
వెంటనే వినియోగంలోకి తేవాలి
కలెక్టర్ పమేలా సత్పతి