
వర్షంలోనూ.. అదే వరుస
చిగురుమామిడి/గంగాధర / హుజూరా బాద్‌రూరల్: ఓ వైపు వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా యూరియా కోసం రైతులు వరుసలో నిల్చున్నారు. గొడుగులు పట్టుకుని గంటల తరబడి ఎదురుచూశారు. చిగురుమామిడి, ఇందుర్తి, బొమ్మనపల్లి గ్రామాల్లో యూరియా కోసం మంగళవారం ఉదయమే రైతులు, మహిళలు క్యూలో నిలబడ్డారు. ఒక్కో రైతుకు రెండేసి బస్తాలు ఇవ్వగా.. సరిపోవడంలేదని పలువురు నిరసన వ్యక్తం చేశారు. గంగాధర మండలం కురిక్యాల సహకార సంఘానికి యూరియా వచ్చిందనే సమాచారంతో మంగళవారం వేకువజామున్నే రైతులు తరలివచ్చారు. ఎకరాకు ఒకటే బస్తా ఇవ్వడంతో సరిపోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ మండలం జూపాక గ్రామంలోని ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియాకోసం రైతులు బారులు తీరారు. సరిపడా స్టాక్ లేకపోవడంతో కొంతమంది నిరాశతో వెళ్లిపోయారు.

వర్షంలోనూ.. అదే వరుస