
వాన.. వరద.. బురద
అధ్వానంగా అశోక్‌నగర్ రోడ్డు
నగరంలోని అశోక్‌నగర్ రోడ్డు అధ్వానంగా మారింది. బొమ్మ వెంకన్న భవనం నుంచి పాత బైపాస్ వైపు వెళ్లే లింక్ రోడ్డు నరకం చూపుతోంది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్డు జలమయమైంది. వరదనీళ్లు రోడ్డుపై నిలిచి నడవడానికి కూడా ఇబ్బంది ఏర్పడింది. గతంలో ఈ రోడ్డు నిర్మించడానికి ప్రతిపాదించినా, అది ఆచరణకు నోచుకోలేదు. దీంతో మట్టిరోడ్డు ప్రజలకు చుక్కలు చూపుతోంది. వర్షం పడిన ప్రతిసారి ఈ రోడ్డుపై వరదనీళ్లు నిలుస్తుండడం, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతుండడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. నగరపాలకసంస్థ అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. – కరీంనగర్ కార్పొరేషన్

వాన.. వరద.. బురద