
బీసీ గర్జన సభ ఏర్పాట్లు పరిశీలన
కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్‌లోని జోతిబా పూలే గ్రాండ్‌లో ఈ నెల 14న నిర్వహించే బీసీ గర్జన సభ ఏర్పాట్లను సోమవారం మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పరిశీలించారు. వారి వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు హరిశంకర్ తదితరులున్నారు.
పీఏసీఎస్ ఆధ్వర్యంలో సోలార్ సేవలు గర్వకారణం
చొప్పదండి: రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా సోలార్ విద్యుత్ సేవలు చొప్పదండి పీఏసీఎస్ ద్వారా ప్రారంభమవుతున్నాయని న్యాప్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు అన్నారు. చొప్పదండి శివారులోని పీఏసీఎస్ భూమిలో సోమవారం సోలార్‌ప్లాంటు భూమిపూజ కార్యక్రమానికి హాజరై పలువురికి చెక్కులు అందించారు. చొప్పదండి వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో తొలిసారి సోలార్ ప్లాంటు ప్రారంభించడం గర్వకారణమన్నారు. ఇప్పటికే పీఏసీఎస్ జనరిక్ మందుల దుకాణం ప్రారంభించి ఖ్యాతిని మూటగట్టుకుందన్నారు. సంఘాన్ని ముందుండి నడిపిస్తున్న వెల్మ మల్లారెడ్డికే ఈ క్రెడిట్ దక్కుతుందన్నారు. వైస్ చైర్మన్ ముద్దం మహేశ్‌గౌడ్, సీఈవో కళ్ళెం తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీలు గుర్రం భూమారెడ్డి, వల్లాల కృష్ణహరి తదితరులు పాల్గొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు
● ఏసీపీ వెంకటస్వామి
గంగాధర(చొప్పదండి): మండలంలోని మధురానగర్ చౌరస్తాలో సోమవారం వేకువజామున కరీంనగర్ రూరల్ ఇన్‌చార్జి ఏసీపీ ఎన్.వెంకటస్వామి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 91 ద్విచక్రవాహనాలు, ఆటో, కారు, ట్రాక్టర్‌ను స్వాఽధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, ఎవరైనా సైబర్ మోసానికి గురైతే గంటలోపు 1930 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే దొంగిలించబడిన సొమ్మును ఫ్రీజ్ చేయించవచ్చన్నారు. మాదకద్రవ్యాల అమ్మకం, రవాణా, వినియోగం చట్టపరంగా నేరమని, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇలాంటి వాటిపై సమాచారం ఉంటే డయల్ 100, లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. షీ టీం సీఐ శ్రీలత సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సీఐలు ప్రదీప్‌కుమార్, బి.సదన్‌కుమార్, కోటేశ్వర్‌రావు, కె.సంజీవ్, ఎస్సైలు వంశీకృష్ణ, నరేందర్‌రెడ్డి, కె.రాజు, సాయికృష్ణ, సయ్యద్‌అన్వర్, పి.లక్ష్మారెడ్డి, నరేశ్, యాంటీ నార్కొటిక్ బ్యూరో పుల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కొండన్నపల్లి శివారులోని సహస్రలింగేశ్వర ఆలయ పరిసరాల్లో జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మారుతీనగర్, అశోక్‌నగర్, కాపువాడ, అహ్మద్‌పుర, ఓల్డ్ బజార్, మేదరివాడ, బొమ్మకల్ రోడ్ ప్రాంతాలు, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్‌కాలనీ, భవానీకాలనీ, సప్తగిరికాలనీ, అంజనాద్రి దేవాలయం, ధోబీఘాట్, గోదాంగడ్డ, బీఎస్‌ఎఫ్ క్వార్టర్లు, ఏఓస్ పార్కు కాలనీ, జెడ్పీ క్వార్టర్లు, భగత్‌నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్, ఎం.లావణ్య తెలిపారు.

బీసీ గర్జన సభ ఏర్పాట్లు పరిశీలన

బీసీ గర్జన సభ ఏర్పాట్లు పరిశీలన

బీసీ గర్జన సభ ఏర్పాట్లు పరిశీలన