
అంతర్జాతీయస్థాయిలో రాణించాలి
కరీంనగర్‌స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడాకారులు అంతర్జాతీయస్థాయికి ఎదగాలని కరీంనగర్ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి సీనియర్ ఖోఖో పోటీల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉ మ్మడి జిల్లా క్రీడాకారుల్లో ప్రతిభకు కొదవ లేదన్నారు. జిల్లా ఖోఖో క్రీడా రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో రాష్ట్ర, జాతీయస్థాయి ఖోఖో పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వై.మహేందర్‌రావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి 130మంది క్రీడాకారులు, 20 మంది టెక్నికల్ అఫీషియల్, 30 మంది సీనియర్ క్రీడాకా రులు ఈ పోటీల్లో పాల్గొన్నారన్నారు. కరీంనగర్ జి ల్లా ఖోఖో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, ఆర్‌ఐ కు మారస్వామి, వివిధ జిల్లాల ప్రధాన కార్యదర్శులు డాక్టర్ వేల్పుల కుమారస్వామి, డాక్టర్ ఏ రవీందర్, ఎస్.కె మహినోద్దీన్, వి సూర్యప్రకాష్, జిల్లా పేట అ ధ్యక్ష కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివా స్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు టి లక్ష్మయ్య, అంతర్జాతీయ కోచ్ నరేశ్, జగిత్యాల ఎస్సై రమేశ్, పెద్దపల్లి జిల్లా పెటా సంఘ అధ్యక్షుడు డాక్టర్ వేల్పుల సురేందర్, అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారులు గెల్లు మధుకర్, వెంకటేశ్, బి రాజు, డాక్టర్ నవీన్ పాల్గొన్నారు.
జిల్లా ఖోఖో సంఘం అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి
ముగిసిన ఉమ్మడి జిల్లాస్థాయి ఖోఖో పోటీలు