బీసీలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదు | - | Sakshi
Sakshi News home page

బీసీలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదు

Aug 11 2025 6:58 AM | Updated on Aug 11 2025 6:58 AM

బీసీల

బీసీలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదు

● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం

కరీంనగర్‌ కల్చరల్‌: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగిస్తోందని, ఈ అంశంపై బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం మండిపడ్డారు. కరీంనగర్‌ డీసీసీ కార్యాలయంలో ఆదివారం మాట్లాడుతూ.. బీసీ, బడుగు, బలహీనవర్గాల హక్కుల సాధన కోసం కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు బీసీ రిజర్వేషన్లలో మైనారిటీలను తొలగించాలని షరతు పెట్టడం దారుణమన్నారు. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మ హారాష్ట్రలో ముస్లింలను బీసీ రిజర్వేషన్ల నుంచి తొలగించాలని ప్రధాన మోదీని డిమాండ్‌ చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే డిమాండ్‌ పెట్టాలని కేంద్ర హోంశాఖ సహా యమంత్రి బండిసంజయ్‌కి సవాలు విసిరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసేసిన ధర్నాచౌక్‌ను తిరిగి ప్రజలకు అందించింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అని, నిజాయితీ ఉంటే కవిత, కేటీఆర్‌, హరీశ్‌రావుతో ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేయాలని సూచించారు. నాయకులు తాజు ద్దీన్‌, శ్రవణ్‌నాయక్‌, కొరవి అరుణ్‌కుమార్‌, రాజు, గంగుల దిలీప్‌, సాగర్‌ పాల్గొన్నారు.

ఐక్యంగా ముందుకు సాగాలి

కరీంనగర్‌ టౌన్‌: గ్రామస్థాయి నుంచి మున్నూరు కాపు యువత అన్ని రంగాల్లో ముందుకుసాగాలని మున్నూరు కాపు సంఘం అపెక్స్‌ కమిటీ చైర్మన్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ సూచించారు. మున్నూరు కాపు సంఘం తెలంగాణ యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సత్తినేని శ్రీనివాస్‌ నియామకమైన సందర్భంగా ఆదివారం జ్యోతినగర్‌లో ఆయన్ను సత్కరించారు. సంఘం నాయకులు బొల్లం లింగమూర్తి, దామెరకొండ సంతోష్‌, వంగల రమేశ్‌, దొడ్ల దేవేందర్‌ పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్లు 42శాతం అమలు చేయాలి

కరీంనగర్‌: బీసీ రిజర్వేషన్లు 42శాతం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సెంటర్‌లో ఆదివారం ధర్నా నిర్వహించారు. వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ తీర్మానం చేసి 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపిందన్నారు. రిజర్వేషన్ల సాధనకు రాజీలేని పోరా టాలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీకి సూచించా రు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గుడికందుల సత్యం, బీమాసాహెబ్‌, జిల్లా కమిటీ సభ్యుడు కోనేటి నాగమణి పాల్గొన్నారు.

నేడు సుడా భవనానికి శంకుస్థాపన

కరీంనగర్‌ కార్పొరేషన్‌: శాతవాహన అర్బన్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటి (సుడా) వాణిజ్య సముదాయ భవ న నిర్మాణానికి శంకుస్థాపన పడనుంది. గతంలోనే భవన నిర్మాణానికి నగరంలోని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కన స్థలం కేటాయించారు. రూ.4కోట్లతో నిర్మించనున్న సుడా భవన సముదాయానికి సోమవారం ఉదయం 10గంటలకు భూమిపూజ చేయనున్నట్లు సుడా చైర్మన్‌ నరేందర్‌రెడ్డి తెలిపారు. సుడా నిధులు రూ.79 లక్షలతో ఆధునీకరించనున్న ఐడీఎస్‌ ఎంటీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులకు ఉదయం 10.30 గంటలకు శంకుస్థాపన చేస్తారన్నారు. ముఖ్య అతిథులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌ రావు, పొన్నం ప్రభా కర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరవుతారని తెలిపారు.

బీసీలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదు
1
1/3

బీసీలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదు

బీసీలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదు
2
2/3

బీసీలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదు

బీసీలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదు
3
3/3

బీసీలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement