
చోర్.. పారాహుషార్
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడిన నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిని పోలీసులు ఈనెల 4వ తేదీన అరెస్టు చేశారు. సదరు వ్యక్తి కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో తన భార్యకు ఆపరేషన్ చేయించేందుకు వచ్చాడు. పొద్దంతా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ.. రాత్రిళ్లు చోరీలకు పాల్పడ్డాడు. గన్నేరువరం, తిమ్మాపూర్, రామడుగు, చిగురుమామిడిలో దొంగతనాలు చేశాడు. సదరు వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్టు చేసి 18 తులాల బంగారం, 164 తులాల వెండి, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు.