
త్వరలో ఎస్‌టీపీ ఆధునీకరణ
కరీంనగర్‌కార్పొరేషన్: పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(ఎస్‌టీపీ)ను ఆధునీకరిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ పేర్కొన్నారు. నగరంలోని ఎస్‌టీపీని శుక్రవారం సందర్శించారు. ఎస్‌టీపీ ఆధునీకరణకు సంబంధించి డీపీఆర్‌ను రూపొందించాలని ప్రైవేట్ టెక్నికల్ కన్సల్టెన్సీ ప్రతినిధులకు సూచించా రు. సమీపం నుంచి వెళ్లే నాలాలో వ్యర్థాలను తొలగించి, మురుగునీరు సులువుగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని అన్నారు. డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, డీఈ లచ్చిరెడ్డి పాల్గొన్నారు.
హెచ్‌టీ సర్వీసులకు మోడమ్
కొత్తపల్లి(కరీంనగర్): టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలోని హైటెన్షన్ (హెచ్‌టీ) సర్వీసుల మోడమ్ ఇన్‌స్టాలేషన్, కమిషనింగ్ పనులు కొనసాగుతున్నాయి. 990 హెచ్‌టీ సర్వీసులకు ఈ ప్రక్రియ సాగుతోంది. పనులు పూర్తయ్యాక తదుపరి నెలలో హై వ్యాల్యూ హెచ్‌టీ మీటర్లు అందించనున్నారు. ఈ మీటర్ల ద్వారా రియల్ టైమ్‌లో మానిటరింగ్ చేయగలిగే సామర్థ్యం లభించడంతో పాటు రీడింగ్‌ను ఆన్‌లైన్‌లో తీసుకుని, తక్షణ బిల్లింగ్ వ్యవస్థను అమలు చేయడం జరుగుతుందని ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు తెలిపారు.
‘శుక్రవారం సభ ఉపయోగకరం’
కరీంనగర్: మహిళా సమస్యలకు శుక్రవారం సభ పరిష్కార వేదికగా నిలుస్తుందని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కాశ్మీర్‌గడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో జరిగిన శుక్రవారం సభలో పాల్గొని మాట్లాడుతూ.. మహిళల తమ సమస్యలు ఏవైనా శుక్రవారం సభలో విన్నవించుకోవచ్చనని తెలిపారు. సీడీపీవో సబితా మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రాథమిక విద్యతో పాటు పిల్లల సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించ డం జరుగుతుందన్నారు. మెడికల్ ఆఫీసర్ సఫి ర్ హుస్సేన్ మాట్లాడుతూ మహిళలకు 50రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్ఖానాగడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో అన్నప్రాసన, రాఖీ వేడుకలు నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ దిలీప్ పాల్గొన్నారు.

త్వరలో ఎస్‌టీపీ ఆధునీకరణ