
సిరిసిల్ల, హకీంపేటల్లో డ్రైవింగ్ శిక్షణ
సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా హెవీ వెహికిల్(బస్సు) డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చిందని.. సిరిసిల్ల, హైదరాబాద్ శివారులోని హకీంపేటల్లో శిక్షణ ఇస్తారని రాజన్నసిరిసిల్ల డీఆర్‌డీవో శేషాద్రి తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లా సమాఖ్య ఆఫీస్‌లో గురువారం డ్రైవింగ్ శిక్షణ అవగాహన సదస్సులో డీఆర్డీవో మాట్లాడారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్), మొవో(ఎంవోడబ్ల్యూవో) అనే స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. మూడు నెలలపాటు పూర్తిగా రెసిడెన్షియల్‌గా శిక్షణ ఇస్తారని, శిక్షణకు అయ్యే ఖర్చులను ప్ర భుత్వం భరిస్తుందని తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షల్లో ఎంపికై న అభ్యర్థులకు సిరిసిల్ల, హకీంపేటల్లో శిక్షణ ఇస్తారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల కు చెందిన 37 మంది అభ్యర్థులు అవగాహన సదస్సుకు హాజరయ్యారు. సెర్ప్ సీడీవో రజిత, ఎంవో డబ్ల్యూవో ప్రతినిధులు జయభారతి, జనెల్ బైట్, స్వేత దుక్తల, రత్నశ్రీ, అడిషనల్ డీఆర్‌డీవో శ్రీనివా స్, కో–ఆర్డినేటర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.