
ఆకర్షిస్తున్న హస్తకళా మేళా
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న కళాభారతి చేనేత, హస్తకళా మేళా సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పశ్చిమ బెంగాల్కు చెందిన ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ఆంటిక్ జ్యువెల్లరీ, హస్త కళల ఉత్పత్తులు, పిల్లల ఆట వస్తువులు, డ్రెస్ మెటీరియల్స్ ఆకట్టుకుంటున్నాయి. లేడీస్ ఫ్యాన్సీ ఐటెమ్స్, ఎంబ్రాయిడరీ టాప్స్, ఆప్లిక్ వర్క్ ఐటెమ్స్, ఒడిశా పెయింటింగ్స్, సిల్క్ డ్రెస్ మెటీరియల్, భగల్‌పురి చద్దర్లు, బ్రాస్ వస్తువులు, జ్యూట్ బ్యాగులు, చెప్పులు, మైసూర్ అగర్‌బత్తీలు, చందన్ పౌడర్ విక్రయిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన, అమ్మకాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.